ఒకటే వాంతులు.. ఏం తినాలి?
నాకిప్పుడు రెండోనెల. అంతా వికారంగా, వాంతి వచ్చినట్లుగా అవుతోంది. ఏమీ తినాలనిపించడం లేదు. చాలా నీరసంగా అనిపిస్తోంది. బిడ్డతోపాటు నేనూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి? మొదటి మూడు నెలల్లో ఆహార పరిమాణంపై కాకుండా పోషకాలపై దృష్టిపెడితే చాలు. వాంతులవుతున్నాయని తిండి మానేయొద్దు. నిదానంగా జీర్ణమయ్యేవి తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉండటమో, వాంతులై
నాకిప్పుడు రెండోనెల. అంతా వికారంగా, వాంతి వచ్చినట్లుగా అవుతోంది. ఏమీ తినాలనిపించడం లేదు. చాలా నీరసంగా అనిపిస్తోంది. బిడ్డతోపాటు నేనూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి?
- అమ్ములు, హైదరాబాద్
మొదటి మూడు నెలల్లో ఆహార పరిమాణంపై కాకుండా పోషకాలపై దృష్టిపెడితే చాలు. వాంతులవుతున్నాయని తిండి మానేయొద్దు. నిదానంగా జీర్ణమయ్యేవి తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉండటమో, వాంతులై బయటకు వెళ్లిపోవడమో జరుగుతుంది. కాబట్టి, తేలిగ్గా అరిగేవి తీసుకోవాలి. చల్లని పెరుగన్నం, చల్లటి పాలు, సగ్గుబియ్యం పాయసం వంటివి తీసుకుంటే వాంతుల వల్ల వచ్చే గొంతు మంట తగ్గుతుంది. దానిమ్మ, నిమ్మ, ద్రాక్ష, ఆరెంజ్... పండ్ల రసాలను ఐస్‌క్యూబ్‌లా చేసుకునీ తీసుకోవచ్చు. వేయించిన సోంపు, ఎండు ఉసిరి ముక్కలు బుగ్గనపెట్టుకున్నా వికారం తగ్గుతుంది.
కార్న్‌ఫ్లేక్స్, సీరియల్ బార్స్, ఖర్జూరాలు, బ్రెడ్ జామ్, అటుకులు, ఇడ్లీ, సగ్గుబియ్యం కిచిడి, సేమ్యా ఉప్మా, అటుకుల ఉప్మా, కట్లెట్, ఆలూ శాండ్‌విచ్, ఉడకబెట్టిన చిలగడదుంప తినొచ్చు. నూనె, మసాలాలకి ఈ సమయంలో దూరంగా ఉండాలి. మిల్క్‌షేక్స్, తాజాపండ్ల రసాలు, బ్రెడ్, పీనట్ బటర్‌తో శాండ్‌విచెస్‌లనూ తీసుకోవచ్చు. అన్ని రకాల పదార్థాలనూ ఒకేసారి తినడంలా కాకుండా టైమ్ గ్యాప్ ఇస్తూ తీసుకోవాలి. ఒకసారి పప్పన్నం, మరోసారి పెరుగన్నం.. ఇలా. పాలు, పెరుగు, ఆకుకూరలు, తాజా పండ్లు ముఖ్యంగా పసుపు రంగులో ఉన్నవి, తాజా కూరగాయలు, గుడ్లు, పనీర్, ఎండుఫలాలనూ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. తినగానే వెంటనే పడుకోవద్దు. రోజూ కాసేపు తప్పక నడవాలి. సాధ్యమైనంత వరకు నిటారుగా కూర్చోవడానికే ప్రయత్నించాలి. ఇవన్నీ చేస్తే మందులు అవసరం లేకుండానే ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.