ఆయన్ను మార్చాలంటే...

మావారికి సిగరెట్‌, మందు లాంటి దురలవాట్లు ఉన్నాయి. రేపు ఆయనకు ఏమైనా జరిగితే.. ఒంటరిదాన్ని అయిపోతానన్న ఊహే నన్ను భయపెడుతోంది. ఎంత చెప్పినా వినట్లేదు. తేలిగ్గా కొట్టిపారేస్తారు. తన మాటే నెగ్గించుకుంటారు. ఆయన్ను మార్చేదెలా?

Updated : 02 Dec 2021 06:08 IST

మావారికి సిగరెట్‌, మందు లాంటి దురలవాట్లు ఉన్నాయి. రేపు ఆయనకు ఏమైనా జరిగితే.. ఒంటరిదాన్ని అయిపోతానన్న ఊహే నన్ను భయపెడుతోంది. ఎంత చెప్పినా వినట్లేదు. తేలిగ్గా కొట్టిపారేస్తారు. తన మాటే నెగ్గించుకుంటారు. ఆయన్ను మార్చేదెలా?

- ఓ సోదరి, కాకినాడ

కొందరు మానసికంగా ఎదగకపోవడం వల్ల ఎవరెన్ని మంచి మాటలు చెప్పినా ఆమోదించరు. మొండి వైఖరితో తాము అనుకున్నదే చేస్తారు. తప్పు చేస్తున్నామన్న భయం కానీ, చెడు అలవాట్లతో ఇల్లూ ఒళ్లూ గుల్లవుతాయన్న విచక్షణ గానీ ఉండవు. ఒకవేళ హానిచేస్తాయని తెలిసినా, మూర్ఖంగా అలాగే ప్రవర్తిస్తారు. ఇదంతా వారి వ్యక్తిత్వంలో భాగం. అతను చిన్నప్పటి నుంచి అలాగే ఉండి ఉండొచ్చు. మీరు చెప్పాలని ప్రయత్నించినా చిన్నచూపుతో లెక్కచేయరు. స్వయంగా దెబ్బతగిలితే తప్ప పట్టించుకోరు. వీలైతే అతనికి ఆప్తులైన తల్లిదండ్రులు, మేనమామ, స్నేహితుల్లో ఎవరి మాట వింటాడో వారితో చెప్పించండి. అప్పటికీ వినకపోతే మీరు ఆ విషయాన్ని వదిలేసి ఏదైనా ఉద్యోగం చూసుకోండి. రేపటి రోజు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కొంత డబ్బు ఆదా చేసుకోండి. ‘ఈ అలవాట్లతో మీ ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా ఇంటిల్లిపాదిమీ అవస్థ పడుతున్నాం. నేను ఉద్యోగం చేస్తే కుటుంబమైనా నిలబడుతుంది’ అంటూ విడమర్చి చెప్పండి. అతని తీరులో మార్పు రాకుంటే మీరైనా ప్రణాళికాబద్ధంగా నడచుకుంటూ పిల్లలకు మంచి పద్ధతులు నేర్పండి. వాళ్లు అలాంటి మార్గంలోకి వెళ్లకుండా పెంచండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని