సాయం చేయాలనుంది.. కానీ!

సాంకేతిక రంగంలో పని చేస్తున్నా. ఇటీవలే ఓ జూనియర్‌ అమ్మాయి బృందంలో చేరింది. ఈ రంగంలో సహజమైన పురుషాధిక్యత, లింగ వివక్షతో చాలా ఇబ్బందులు పడుతోంది. ప్రతి విషయంలో డిపార్ట్‌మెంట్‌, ఇతర వ్యక్తుల నుంచి మందలింపులు, ఒక్కోసారి పనివ్వకుండా పక్కన పెట్టడం వంటి ఎన్నో ఎదుర్కొంటోంది. ఇలాంటివి జరిగినప్పుడు సిస్టమ్‌పై చిరాకు పడటమో, తన సమస్యలను నాతో పంచుకోవడమో చేస్తుంది.

Published : 24 Feb 2022 01:04 IST

సాంకేతిక రంగంలో పని చేస్తున్నా. ఇటీవలే ఓ జూనియర్‌ అమ్మాయి బృందంలో చేరింది. ఈ రంగంలో సహజమైన పురుషాధిక్యత, లింగ వివక్షతో చాలా ఇబ్బందులు పడుతోంది. ప్రతి విషయంలో డిపార్ట్‌మెంట్‌, ఇతర వ్యక్తుల నుంచి మందలింపులు, ఒక్కోసారి పనివ్వకుండా పక్కన పెట్టడం వంటి ఎన్నో ఎదుర్కొంటోంది. ఇలాంటివి జరిగినప్పుడు సిస్టమ్‌పై చిరాకు పడటమో, తన సమస్యలను నాతో పంచుకోవడమో చేస్తుంది. చాలా సందర్భాల్లో పరిస్థితిని సరిదిద్దడంలో సాయం చేద్దామనుకుంటే తిరస్కరించింది. తనడగందే సాయం చేయలేను. తనకు తోడ్పడలేకపోతున్నాననే అపరాధభావం. ఈ పరిస్థితిని మార్చకపోతే తనను బాధించే వారిలో నేనూ భాగస్వామిని అయినట్టేనా?

- ఓ సోదరి


మహిళగా, ఆమె మీ సహాయాన్ని తిరస్కరించడాన్ని నేనర్థం చేసుకోగలను. మీతో విషయం చర్చిస్తోందంటే అది మీపై ఆమెకున్న నమ్మకమే. అయితే చాలామంది మహిళలు ఇలాంటి వాటి గురించి కేవలం మాట్లాడటానికే మొగ్గు చూపుతారు. పరిష్కారం పైనుంచే రావాలనుకుంటారు. కాబట్టి, మీరు తన కోరికను మన్నించండి. పొరబాటున మీరేదైనా చర్య తీసుకుంటే అది ఆమెకి మరింత సమస్యగా మారొచ్చు. మరి పరిష్కారమేంటి? మీ సమక్షంలో మాత్రం అన్యాయం జరగకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించడమే. ఉదాహరణకు- తనేదైనా సలహా చెబుతోంటే, మిగతావాళ్లు దాన్ని విస్మరిస్తున్నారనుకోండి. ‘తను చెబుతోంది ఓసారి విందామా?’ అనొచ్చు. మధ్యలో ఆపే ప్రయత్నం చేసినా.. పూర్తిగా చెప్పనిద్దామనొచ్చు.
అయితే, దీన్ని మీరు అన్ని సమయాల్లో చేయలేరు. మీరిద్దరూ స్నేహితులన్న సంకేతాన్నిచ్చిన వారవుతారు. కాబట్టి, సందర్భాలను చూసుకోండి. మీ ఉద్దేశం మంచిదే అయినా మీ జూనియరూ తన బాధ్యతలను గుర్తించాలి. సొంత సమస్యలను పరిష్కరించుకునే చొరవ చూపాలి. స్పందించే వరకూ దృఢంగా ఉండాలి. మాట్లాడే ఆత్మవిశ్వాసం ఆమెకు లేనపుడు వృత్తిపరమైన అభివృద్ధీ అసాధ్యమే కదా! ఎలా సాగాలన్నదీ నేర్చుకోవాల్సిందే. చివరగా.. సాయం చేయాలన్న మీ ప్రయత్నం మాత్రం అభినందనీయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్