ముక్కు పక్కన ఎందుకలా?

ముక్కు పక్కన పొలుసుల్లా చర్మం రాలుతోంది. ఎర్రగా కనిపించడమే కాదు. ఏదైనా తగిలితే విపరీతమైన మంట. ఎందుకిలా అవుతోంది? పోగొట్టుకునేదెలా?

Published : 15 Oct 2023 02:25 IST

ముక్కు పక్కన పొలుసుల్లా చర్మం రాలుతోంది. ఎర్రగా కనిపించడమే కాదు. ఏదైనా తగిలితే విపరీతమైన మంట. ఎందుకిలా అవుతోంది? పోగొట్టుకునేదెలా?

- ఓ సోదరి

దీనికి రకరకాల కారణాలుంటాయి. సెబోరిక్‌ డెర్మటైటిస్‌ని ముఖమ్మీద డాండ్రఫ్‌గా చెబుతాం. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ కాదు. ఇన్‌ఫ్లమేషన్‌ కారణంగానూ ఇలా జరుగుతుంది. ముక్కుపక్కన పొట్టులా రాలి ఎర్రగా మారుతుంది. ఒక్కోసారి కనుబొమల వద్దా వస్తుంది. రావడానికి ఇదే కారణమని ప్రత్యేకంగా చెప్పలేం. క్లాట్రెమజాల్‌ క్రీములు, మాయిశ్చరైజర్‌ తప్పక రాయండి. తగ్గిపోతుంది. ఒక్కోసారి వాతావరణంలో మార్పులూ కారణం అవొచ్చు. కాలుష్యం, అతి చలి లేదా అతి వేడిలో తిరిగినా ఇలా జరుగుతుంది. తరచూ మాయిశ్చరైజర్‌ లేదా సహజ నూనెలను రాస్తూ ఉంటే సమస్య అదుపులోకి వస్తుంది. టాపికల్‌ రెటినాయిడ్స్‌, సాల్సిలిక్‌ యాసిడ్‌, బెంజైల్‌ పెరాక్సైడ్‌, ఫోమింగ్‌ క్లెన్సర్లు, ఆల్కహాల్‌తో కూడిన టోనర్లు రాయడం, తరచూ స్క్రబ్‌ లాంటివి చేస్తున్నారేమో గమనించుకోండి. ముక్కు పక్కన చర్మం మామూలుగానే చాలా సున్నితంగా ఉంటుంది. వీటిలో ఏవి పడకపోయినా, అతి అయినా ముక్కుతోపాటు కళ్ల చుట్టూ కూడా ఇలా పొడిబారి, పొట్టు రాలినట్టుగా అవుతుంది. వారానికోసారి స్క్రబ్‌, తక్కువ గాఢత ఉన్న ఉత్పత్తులను ఎంచుకోండి.

ఇటీవల జలుబు చేసినా కొన్నిసార్లు సీజనల్‌ అలర్జీల వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. రోజూ తగినంత నీరు తాగుతున్నారా అన్నదీ చెక్‌ చేసుకోండి. ఇదీ సున్నిత భాగాల్లో చర్మం పొడిబారడానికి కారణమవుతుంది. సబ్బులు కాకుండా క్రీమీ క్లెన్సర్లను వాడండి. సెరమైడ్స్‌, హైలురోనిక్‌ యాసిడ్‌ ఉన్న క్రీములతోపాటు సన్‌స్క్రీన్‌నీ తప్పక వాడండి. బాగా వేడినీళ్లతో కాకుండా గోరువెచ్చని నీటితోనే ముఖం కడగాలి. కారణం గమనించుకొని దానికి తగిన జాగ్రత్త తీసుకోండి. త్వరగానే సమస్య అదుపులోకి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్