మొదటిసారి గర్భస్రావాలు ఎక్కువా?
నాకు 25 ఏళ్లు. మూడు నెలల గర్భిణిని. మొదటిసారి గర్భం చాలా బలహీనంగా ఉంటుందనీ, గర్భస్రావం (అబార్షన్) అయ్యే ప్రమాదమెక్కువని విన్నా. ఇది నిజమేనా... ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు
నాకు 25 ఏళ్లు. మూడు నెలల గర్భిణిని. మొదటిసారి గర్భం చాలా బలహీనంగా ఉంటుందనీ, గర్భస్రావం (అబార్షన్) అయ్యే ప్రమాదమెక్కువని విన్నా. ఇది నిజమేనా... ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ఓ సోదరి
మొదటి ప్రెగ్నెన్సీ అయినా నాలుగో గర్భమైనా గర్భస్రావాలనేవి జరగొచ్చు. అంతేతప్ప మొదటిసారి గర్భం దాల్చినప్పుడే ఎక్కువగా అవుతాయన్న దాంట్లో నిజం లేదు. వందమంది గర్భిణులను తీసుకుంటే అందులో 15-20 శాతం మందిలో గర్భస్రావాలు (మొదటి, రెండు, మూడు... ఇలా ఎన్నో ప్రెగ్నెన్సీలోనైనా ) జరగొచ్చు. సాధారణంగా గర్భస్రావాలు రెండు రకాలు. ఒకటి... దానంతట అవి జరిగేవి. రెండు... తల్లికి కానీ, బిడ్డకు కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు వైద్యులు చేసేవి. సహజంగా జరిగే గర్భస్రావాల్లో..అందులోనూ ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో జరిగే గర్భస్రావాల్లో నూటికి 60 శాతం క్రోమోజోముల్లో లోపాల వల్ల జరుగుతాయి.
ఇక మిగిలిన 40 శాతం గర్భస్రావాలు... శిశువుకి వివిధ కారణాల వల్ల పుట్టుకతో వచ్చే అవకరాలు (మెదడు, వెన్నెముక నిర్మాణంలో లోపాలు), ఇన్ఫెక్షన్లు, ఇమ్యూనిటీ, హార్మోన్ల వ్యవస్థలో సమస్యలు, గర్భాశయం ఆకృతిలో లోపాల వల్ల జరుగుతాయి. ముఖ్యంగా అసాధారణ క్రోమోజోములే ఈ అబార్షన్లకు ప్రధాన కారణం.
ఇక రెండో త్రైమాసికంలో జరిగేవాటికి కారణాలు... ఇన్ఫెక్షన్లు, తల్లికి ఆరోగ్య సమస్యలు (మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు) ఆర్‌హెచ్ నెగెటివ్ గ్రూపు ఉన్నవారికి జరిగే ఐసో ఇమ్యూనైజేషన్, గర్భాశయంలో సెప్టెమ్ బై కార్నుయేట్ యుటరస్ లాంటి లోపాలు, గర్భాశయ ముఖద్వారం వదులుకావడం... ఇవన్నీ ముఖ్యకారణాలు.
జాగ్రత్తలు... ఎన్నోసారి గర్భం ధరించినా సాధారణంగా గర్భిణులందరూ తీసుకునే జాగ్రత్తలే తీసుకోవాలి. సమతుల ఆహారం, చక్కటి జీవన శైలి, తగినంత వ్యాయామం, రెగ్యులర్ చెకప్, వ్యాక్సిన్లు ఎప్పటికప్పుడు వేయించుకోవడం, డాక్టర్లు సూచించిన పరీక్షలు చేయించుకోవడం ఇవన్నీ అవసరం. ముఖ్యమైన సూచన ఏమిటంటే కొవిడ్ పెరుగుతున్న ఈ సమయంలో అనవసరమైన ప్రయాణాలు, ఎక్కువ జనం గుమిగూడే కార్యక్రమాలు, వేడుకలకు దూరంగా ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ధవళవర్ణంలో దేవకన్యలా..!
- Asoka Makeup Trend: అప్పటి కరీనా లుక్‌ని ఇలా రీక్రియేట్ చేస్తున్నారు!
- తారలు మెచ్చిన ‘ఫుల్కారీ’ ఫ్యాషన్.. ఈ స్టైలిష్ ట్రెండ్ గురించి తెలుసా?
- పొడవైన శిరోజాలతో... గిన్నిస్‌బుక్‌లో..!
- ఈ ఆహారంతో జుట్టు ఆరోగ్యంగా..!
ఆరోగ్యమస్తు
- వీటితో.. కడుపు చల్లగా.. ఆరోగ్యంగా..!
- చనుబాలు ఎక్కువగా వస్తున్నాయి.. తగ్గేదెలా?
- మెనోపాజా... వ్యాయామం చేయండి!
- ఎండకో గొడుగు..!
- హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!
అనుబంధం
- ప్రయోగాలతో నేర్పిద్దామా?
- పెంపకంబట్టి ఎదుగుతారు.!
- నాన్నంటే భయపడుతున్నారు..!
- బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నారా?
- లవ్ మ్యారేజ్.. అయినా సంప్రదాయాల పేరిట టార్చర్ చేస్తున్నాడు..!
యూత్ కార్నర్
- టీనాతో ఇంటర్వ్యూకి సిద్ధమా?!
- రాయల్ సొసైటీలో మన స్వెత్లానా!
- వేసవి కథ!
- 29 బాటిళ్లతో ఒక స్విమ్‌సూట్.. విదేశాల్లోనూ పాపులర్!
- Prachi Nigam: స్టేట్ ఫస్ట్.. అయినా బాడీ షేమింగ్ తప్పలేదు!
'స్వీట్' హోం
- ఫర్నిచర్‌పై మరకలు పోవాలంటే..!
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- తేలిగ్గా వండేద్దాం..!
వర్క్ & లైఫ్
- పట్టు చిక్కాలంటే... ప్రణాళిక ఉండాలి...
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
- రంగులు తెలిసేలా!
- విజయానికి అందం అడ్డయ్యింది!
- భరణం ఇవ్వాల్సొస్తుందని ఉద్యోగం మానేశాడు!