Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 108936
      [news_title_telugu_html] => 

రివ్యూ: కిల్లర్‌

[news_title_telugu] => రివ్యూ: కిల్లర్‌ [news_title_english] => killer telugu movie review [news_short_description] => విజ‌య్ ఆంటోనీకి తెలుగులో మంచి గుర్తింపు, మార్కెట్ ఉంది. సంచ‌ల‌న విజ‌యం సాధించిన ‘బిచ్చ‌గాడు’ త‌ర్వాత ఆయన తమిళంలో న‌టించే ప్ర‌తి సినిమా తెలుగులోనూ విడుద‌లవుతోంది. అయితే ‘బిచ్చ‌గాడు’... [news_tags_keywords] => killer,Vijay Antony,Arjun,Tollywood [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/blHnXjJY3UA [news_videoinfo] => |https://www.youtube.com/embed/blHnXjJY3UA [news_sections] => ,0203, ) )
రివ్యూ: కిల్లర్‌ - killer telugu movie review - EENADU
close
సినిమా రివ్యూ
రివ్యూ: కిల్లర్‌

చిత్రం: కిల్లర్‌
న‌టీన‌టులు: విజ‌య్ ఆంటోనీ, అర్జున్‌, ఆషిమా న‌ర్వాల్‌, సీత‌, నాజ‌ర్, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రామ్ త‌దిత‌రులు
మాటలు, పాటలు: భాష్యశ్రీ

సంగీతం: సైమన్ కె.కింగ్
ఛాయాగ్రహణం: ముఖేష్‌
కూర్పు: రిచర్డ్ కెవిన్.ఎ
పోరాటాలు: దిలీప్ సుబ్బరాయన్
క‌ళ‌: వినోద్ రాజ్ కుమార్
నిర్మాత‌లు: టి.న‌రేష్ కుమార్- టి.శ్రీ‌ధ‌ర్‌
రచన- దర్శకత్వం: ఆండ్రూ లూయిస్
సంస్థ‌: పారిజాతా  క్రియేష‌న్స్‌, దియా మూవీస్
విడుద‌ల: 07-06-2019

విజ‌య్ ఆంటోనీకి తెలుగులో మంచి గుర్తింపు, మార్కెట్ ఉంది. సంచ‌ల‌న విజ‌యం సాధించిన ‘బిచ్చ‌గాడు’ త‌ర్వాత ఆయన తమిళంలో న‌టించే ప్ర‌తి సినిమా తెలుగులోనూ విడుద‌లవుతోంది. అయితే ‘బిచ్చ‌గాడు’ త‌ర్వాత ఆయ‌న్నుంచి వ‌చ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్ర‌భావం చూపించ‌లేక‌పోయాయి. కానీ, విజ‌య్ ఆంటోనీ మాత్రం ప‌ట్టు వ‌ద‌ల‌కుండా రెండు భాష‌ల్ని దృష్టిలో ఉంచుకొని సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. ఈసారి అర్జున్‌తో క‌లిసి ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో ‘కిల్ల‌ర్‌’ చేశారు. మ‌రి ఆ చిత్రం ఎలా ఉంది?  విజ‌య్ ఆంటోనీ ఖాతాలో ‘బిచ్చ‌గాడు’ త‌ర్వాత మ‌రో విజ‌యం ప‌డిన‌ట్టేనా?


క‌థేంటంటే: మినిస్ట‌ర్ త‌మ్ముడు వంశీ హ‌త్య‌కేసుని ప‌రిశోధించే ప‌నిలో ఉంటాడు పోలీసు అధికారి కార్తికేయ (అర్జున్‌). వంశీ హ‌త్యకి కార‌కులుగా జ‌యంతి (ఆషిమా న‌ర్వాల్‌), ఆమె త‌ల్లి (సీత‌)ని అనుమానిస్తూ వాళ్ల‌ని అనుస‌రిస్తుంటాడు. ఇంత‌లో ప్ర‌భాక‌ర్ (విజ‌య్ ఆంటోనీ) ఆ హ‌త్య చేసింది తానేనంటూ పోలీసుల‌కి చెప్పి అరెస్ట్ అవుతాడు.  కార్తికేయ మాత్రం దాన్ని న‌మ్మ‌డు. కేసుని  ర‌క‌ర‌కాల కోణాల్లో ప‌రిశోధించ‌డం మొద‌లు పెడ‌తాడు.  ఈ క్ర‌మంలో కార్తికేయకు ప‌లు షాకింగ్ విష‌యాలు తెలుస్తాయి. అవేంటి? అస‌లు ప్ర‌భాక‌ర్ ఎవ‌రు?  ఆయ‌న‌కీ జ‌యంతికీ మ‌ధ్య సంబంధం ఏమిటి?  నిజంగా ప్ర‌భాక‌రే వంశీని హ‌త్య‌చేశాడా? త‌దిత‌ర విష‌యాలు తెరపై చూడాల్సిందే! 

ఎలా ఉందంటే: ఒక హ‌త్య చుట్టూ సాగే క‌థ ఇది.  ద‌ర్శ‌కుడు క‌థ‌, క‌థ‌నాల్ని రాసుకొన్న విధానం, దాన్ని తెర‌పైకి తీసుకొచ్చిన తీరు ఆక‌ట్టుకుంటుంది. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఆస‌క్తిని రేకెత్తించ‌డం, ఊహించ‌ని మ‌లుపుల‌తో  థ్రిల్‌కి గురిచేయ‌డం స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్స్‌కి ఉండాల్సిన  ప్ర‌ధాన ల‌క్ష‌ణం. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు చూపించిన ప‌నిత‌నం మెప్పిస్తుంది. ప్ర‌భాక‌ర్ అరెస్టుతో క‌థ మొద‌ల‌వుతుంది. హ‌త్య చేసింది తానే అని లొంగిపోయాక పోలీసు అధికారి కార్తికేయ అనుమాన ప‌డ‌టం, మ‌రోకోణంలో కేసుని దర్యాప్తు చేయ‌డం అందులో దోషి ప్ర‌భాక‌ర్‌ అని తేలాక కూడా... మ‌ళ్లీ ఆ కేసుని కొత్తగా మొద‌లు పెట్ట‌డం, ఆ క్ర‌మంలో విష‌యాలు ఒకొక్క‌టిగా బ‌య‌టికి రావ‌డం ఆస‌క్తిని కలిగిస్తాయి.

మొద‌ట ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో ప్ర‌శ్న‌ల్ని రేకెత్తిస్తూ, ఆ త‌ర్వాత క‌థ‌లో చిక్కుముడుల్ని ఒకొక్క‌టిగా విప్పుతూ వాటితోనే ప్రేక్ష‌కుడి మ‌దిలో మెదిలిన ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానాలు చెప్ప‌డం థ్రిల్‌కి గురిచేస్తుంది. హ‌త్య జ‌రిగింది, అదెవ‌రు చేసింద‌న్న‌ది తెలిసినా... ఎలా అనేది చివ‌రి వ‌ర‌కు అంతు చిక్క‌దు. వాటితో ముడిపెడుతూ  ప‌తాక స‌న్నివేశాల్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క‌థానాయ‌కుడి నేప‌థ్యంలో వ‌చ్చే ఫ్లాష్ బ్యాక్ కూడా స‌హ‌జంగా సాగుతూ ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తుంది. ఇలాంటి చిత్రాల‌కి క‌థ కంటే కూడా క‌థ‌నం కీల‌కం. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడికి మంచి మార్కులు పడతాయి. విజ‌య్ ఆంటోనీ నుంచి ఇటీవ‌ల వ‌చ్చిన చిత్రాల‌తో పోలిస్తే ‘కిల్ల‌ర్’ బాగుంది.  ఆరంభ స‌న్నివేశాలు కాస్త గ‌జిబిజిగా అనిపించినా... క‌థ‌లోకి వెళ్లే కొద్దీ ప్రేక్ష‌కుడు అందులో లీన‌మైపోతాడు. ఇటీవ‌ల వ‌చ్చిన మంచి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల్లో ‘కిల్ల‌ర్‌’ ఒక‌టి. 

ఎవ‌రెలా చేశారంటే: విజయ్ ఆంటోనీ ప్ర‌భాక‌ర్ పాత్ర‌లో చాలా స‌హ‌జంగా న‌టించారు. ఆయ‌న హావ‌భావాలు చాలా బాగుంటాయి. స‌న్నివేశాల‌కి అనుగుణంగా పాత్ర‌లో వైవిధ్యం కూడా చూపించారు.  అర్జున్..  కార్తికేయ పాత్ర‌లో ఒదిగిపోయాడు. ఆయ‌న అనుభ‌వం ఈ పాత్ర‌కి బాగా ప‌నికొచ్చింది.  ఆషిమా న‌ర్వాల్ తన ప‌రిధి మేర‌కు న‌టించింది. సీత‌, నాజ‌ర్ త‌దిత‌రుల పాత్ర‌ల ఆక‌ట్టుకుంటాయి. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది.  మాక్స్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. క్రైమ్ నేప‌థ్యంలో స‌న్నివేశాల్లో ఆయ‌న వాడిన క‌ల్లర్‌, మూడ్‌ని మెయింటైన్ చేసేందుకు కెమెరాని వినియోగించిన తీరు చిత్రానికి మ‌రింత బ‌లాన్నిచ్చింది. సంగీత దర్శకుడు సైమ‌న్.కె.కింగ్ పాట‌లతో పాటు, నేప‌థ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. కూర్పు, నిర్మాణ విలువ‌ల‌తో పాటు... ద‌ర్శ‌కుడు ఆండ్రూ లూయిస్ క‌థ‌పై ప‌ట్టుని ప్ర‌ద‌ర్శించిన తీరు సాంకేతిక విభాగానికి మంచి మార్కులు తెచ్చిపెడ‌తాయి.

బలాలు బ‌లహీన‌త‌లు
+ క‌థనం
+ థ్రిల్లింగ్ అంశాలు 
+ న‌టీన‌టులు
+ స‌న్నివేశాలు
- ఆరంభంలో స‌న్నివేశాలు
- కొన్ని పాత సినిమాల్ని గుర్తు చేసే కథ

చివ‌రిగా: ‘కిల్ల‌ర్‌’ ఉత్కంఠతో ఉక్కిరి బిక్కిరి చేస్తాడు.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

 


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.