వెండి ఆభరణాలు వాడుతున్నారా?
సీజన్ ఏదైనా స్టైలిష్‌గా మెరిసిపోవాలనుకునే అమ్మాయిలు ప్రస్తుతం సిల్వర్ జ్యుయలరీకే ఓటేస్తున్నారు. ఇవి సింపుల్‌గా ఉంటూనే.. అమ్మాయిలను ఫ్యాషనబుల్‌గా మార్చేయడమే ఇందుకు కారణం.
సీజన్ ఏదైనా స్టైలిష్‌గా మెరిసిపోవాలనుకునే అమ్మాయిలు ప్రస్తుతం సిల్వర్ జ్యుయలరీకే ఓటేస్తున్నారు. ఇవి సింపుల్‌గా ఉంటూనే.. అమ్మాయిలను ఫ్యాషనబుల్‌గా మార్చేయడమే ఇందుకు కారణం. అయితే వర్షాకాలంలో గాల్లో తేమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వెండి తరహా మెత్తని లోహాలు గాల్లో ఉండే తేమ కారణంగా మెరుపు తగ్గిపోయే అవకాశాలుంటాయి. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే.. వర్షాకాలంలో వీటి విషయంలో శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
ఇవి గుర్తుంచుకోండి!
⚛ పూర్తిగా రడీ అయిన తర్వాతే.. అంటే మేకప్, పెర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకోవడం.. పూర్త్తెన తర్వాతే సిల్వర్ యాక్సెసరీస్ ధరించాలి. లేదంటే వీటిలోని రసాయనాలు ఆభరణాల మెరుపును దెబ్బతీస్తాయి.
⚛ వర్షం పడుతున్నప్పుడు సిల్వర్ జ్యుయలరీ వేసుకోకపోవడమే ఉత్తమం. ఒకవేళ అనుకోకుండా అవి తడిసినా ఇంటికి చేరిన వెంటనే ముందుగా వాటిని పొడిగా ఆరబెట్టుకోవాలి. అవసరమైతే వాటికి మరోసారి మెరుగు పెట్టించినా మంచిదే!
⚛ ఇంటి పనులు చేసేటప్పుడు, స్విమ్మింగ్ చేసేటప్పుడు, అధిక సూర్యరశ్మిలోకి వెళ్లేటప్పుడు.. కూడా ఈ ఆభరణాలను ధరించకూడదు.
⚛ సిల్వర్‌తో తయారు చేసిన ఆభరణాలను శుభ్రం చేయడానికి లిక్విడ్ రూపంలో ఉన్న క్లీనర్లను ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇవి ఆభరణాల సందుల్లో చేరి.. జ్యుయలరీ త్వరగా పాడైపోయేలా చేస్తాయి. కాబట్టి ఇంట్లో లభించే వెనిగర్, బేకింగ్ సోడా.. వంటి న్యాచురల్ క్లీనర్స్‌తో వీటిని శుభ్రం చేయడం మంచిది.
⚛ పెట్టుకున్న ప్రతిసారీ వెండి ఆభరణాల్ని శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. అందుకే తీసిన వెంటనే వాటిని కాటన్ లేదా మస్లిన్ వస్త్రంతో శుభ్రంగా తుడవాలి. తద్వారా వాటిపై చేరిన దుమ్ము, ధూళి తొలగిపోతాయి. తేమ ఉన్నా ఈ క్లాత్ పీల్చేసుకుంటుంది.
భద్రంగా ఇలా!
⚛ సిల్వర్ జ్యుయలరీని గాలి తగలని, పొడి ప్రదేశంలో భద్రపరచాలి. అలాగే ఇతర ఆభరణాలతో కాకుండా వీటిని విడిగా భద్రపరచాలి.
⚛ ఈ ఆభరణాలు ఉంచే ప్రదేశం మరింత పొడిగా ఉండేందుకు ఆ ప్రాంతంలో ఒక చాక్‌పీస్ లేదా సిలికా జెల్ సాచెట్‌ని ఉంచవచ్చు. ఇవి గాలిలోని తేమని పీల్చుకోవడం ద్వారా ఆభరణాల మెరుపు తగ్గకుండా కాపాడతాయి.
⚛ జిప్‌లాక్ సౌకర్యం ఉండే ప్లాస్టిక్ బ్యాగ్‌లో వీటిని భద్రపరచడం ద్వారా ఈ ఆభరణాల మెరుపు అధిక కాలం మన్నేలా జాగ్రత్తపడచ్చు.
⚛ ఈ జ్యుయలరీని భద్రపరిచే బ్యాగ్ లోపల రెండు వైపులా దూది, మెత్తని కాటన్ లేదా మస్లిన్ వస్త్రాన్ని ఉంచితే అవి వంగిపోకుండా, డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.