ప్రెగ్నెన్సీలో ఎంత హిమోగ్లోబిన్ ఉండాలి?
గర్భం ధరించినప్పుడు హిమోగ్లోబిన్ శాతం 11కి తగ్గకుండా చూసుకోవాలి. అబార్షన్ అయినప్పుడు కొన్నిసార్లు విపరీతంగా రక్తస్రావమవుతుంది. ఇదీ రక్తహీనతకు దారి తీస్తుంది. ఎనీమియా సమస్య ఉన్న మహిళల్లో ఇలాంటి ఇబ్బందులొస్తే పరిస్థితి మరింత జటిలమవుతుంది. నాలుగు శాతం హిమోగ్లోబిన్ అంటే చాలా తక్కువ. అతి త్వరగా హిమోగ్లోబిన్ పెంచుకునే పద్ధతులేంటో మీ వైద్యులనడిగి తెలుసుకోండి. వాపు, శ్వాస ఇబ్బందులు, జ్వరం, అలసట... లాంటి ఇతర లక్షణాలను బట్టి చికిత్సను ...
నాకు 27. పెళ్లై ఏడాది. నాలుగో నెలలో అబార్షన్ అయ్యింది. హిమోగ్లోబిన్ 4 శాతమే ఉందన్నారు. ఇది గర్భిణులకు ఎంతుండాలి. రక్తహీనత తగ్గాలంటే ఏం తినాలి?
- ఓ సోదరి
గర్భం ధరించినప్పుడు హిమోగ్లోబిన్ శాతం 11కి తగ్గకుండా చూసుకోవాలి. అబార్షన్ అయినప్పుడు కొన్నిసార్లు విపరీతంగా రక్తస్రావమవుతుంది. ఇదీ రక్తహీనతకు దారి తీస్తుంది. ఎనీమియా సమస్య ఉన్న మహిళల్లో ఇలాంటి ఇబ్బందులొస్తే పరిస్థితి మరింత జటిలమవుతుంది. నాలుగు శాతం హిమోగ్లోబిన్ అంటే చాలా తక్కువ. అతి త్వరగా హిమోగ్లోబిన్ పెంచుకునే పద్ధతులేంటో మీ వైద్యులనడిగి తెలుసుకోండి. వాపు, శ్వాస ఇబ్బందులు, జ్వరం, అలసట... లాంటి ఇతర లక్షణాలను బట్టి చికిత్సను నిర్ణయిస్తారు. పరిస్థితి తీవ్రతను బట్టి కొన్నిసార్లు ఐరన్‌ను డ్రిప్ విధానంలో శరీరంలోకి ఎక్కిస్తారు. లేదా రక్తం కూడా ఎక్కిస్తారు. లేదంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్, బి-కాంప్లెక్స్ విటమిన్ మాత్రలను తీసుకోవాలి.
మాంసకృత్తులు, బి-కాంప్లెక్స్, విటమిన్-సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ మూడూ మీ ఎత్తు, బరువుకు సరిపోయేలా లభించినప్పుడే ఐరన్ మాత్రలను శరీరం శోషించుకుంటుంది. మాంసాహారులైతే గుడ్డు, మాంసం నుంచి ప్రొటీన్లను పొందొచ్చు. శాకాహారులైతే పొట్టుతో ఉన్న సెనగలు, ఆకుకూరలు, డేట్స్ లాంటివి తీసుకోవచ్చు. ఫోలిక్ యాసిడ్ కోసం... మొలకెత్తిన గింజలు, ఆకు కూరలు , పెసలు తినొచ్చు. విటమిన్-సి కావాలంటే ఉసిరి, జామ, బొప్పాయి, క్యాబేజీ, నిమ్మ లాంటివి తీసుకోవచ్చు.
ప్రత్యామ్నాయాలు.. టీ, కాఫీలు ఎక్కువగా తాగొద్దు. ఉప్పు వాడకం తగ్గించాలి. కనీసం మూడు నెలలు పైన చెప్పిన విధంగా మాత్రలు వేసుకుంటూ, పోషకాహారం తీసుకున్నప్పుడు శరీరం స్వతహాగా హిమోగ్లోబిన్‌ను తయారు చేసుకోగలుగుతుంది. గర్భం ధరించాలనుకుంటే హిమోగ్లోబిన్ వృద్ధి కోసం కొత్త ఆహారపు అలవాట్లు చేసుకోవాలి. ఉదాహరణకు మూడుపూటలా రాగులు, సజ్జలు, దంపుడు బియ్యం తీసుకోండి. పెసలు, రాజ్మా, సెనగలతోపాటు కీరా, టొమాటో లాంటివాటిని పచ్చిగా తినాలి. నిమ్మరసం తాగాలి. జామ, బొప్పాయి, కమలాతోపాటు నిల్వ ఉసిరి తిన్నా తగినంత విటమిన్-సి దొరుకుతుంది. పొట్టలో నులిపురుగులు లేకుండా డీ వార్మింగ్ మాత్రలు తప్పనిసరి. హిమోగ్లోబిన్ శాతం పన్నెండు వచ్చిన తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- జాన్వీ ‘క్రికెట్ బాల్’ డ్రస్.. అందుకే వైరల్!
- స్టైల్‌గా... సురక్షితంగా
- బంగారం... ఇలా కొందామా?!
- చర్మ సౌందర్యానికీ ‘గుడ్డు’..!
- కళ్ల కింద నల్లటి వలయాలు.. తగ్గాలంటే..!
ఆరోగ్యమస్తు
- బాలింతలు కోలుకోవడానికే.. ఇవన్నీ!
- చిన్నారులకు ఎంత ఉష్ణోగ్రత దాటితే డాక్టర్‌కి చూపించాలి?
- నిర్లక్ష్యం చేయొద్దు!
- ‘కీరా దోస’తో.. కోరినంత ఆరోగ్యం!
- నలభై దాటాక.. ఇమ్యూనిటీ పెరగాలంటే..!
అనుబంధం
- నా ఫ్రెండ్ భర్త.. అసభ్యకర ఫొటోలు, మెసేజ్‌లు పెడుతున్నాడు!
- అందుకే.. కాస్త రొమాన్స్ కూడా జోడించాల్సిందే..!
- ఆపొద్దు.. ఎగరనిద్దాం!
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- టిక్ టాక్ టో ఆడిద్దామా!
యూత్ కార్నర్
- అమ్మతో.. నా అనుబంధం!
- Akshaya Tritiya: ‘డిజిటల్ గోల్డ్’ కొంటున్నారా?
- అడవితో ప్రేమలో పడి ఐఎఫ్ఎస్లో గెలిచి!
- కథ వెనక కథ
- ఆ గ్రామం నుంచి తొలి నౌకాధికారిణి..!
'స్వీట్' హోం
- ఒకే యాత్రలో మూడింటి దర్శనభాగ్యం!
- Akshaya Tritiya: బంగారం స్వచ్ఛతను తెలుసుకునేదెలా?
- వంట చేసేటప్పుడు.. ఈ చిట్కాలు పాటిస్తున్నారా?
- ముంగిట్లో నక్షత్రాలు రాలుతున్నట్లుగా...!
- వాషింగ్ మెషీన్ వాడేద్దామిలా!
వర్క్ & లైఫ్
- Mother’s Day: అమ్మకూ కావాలో ‘సోలో’ ట్రిప్!
- అప్పులు చేయకపోతేనే ‘అక్షయ’మయ్యే ఆనందం!
- ఆఫీసు కష్టాలు చెప్పే ఊలు బంతి!
- బాబుకి డయాబెటిస్... ఏం పెట్టాలి?
- అది అతి అయ్యిందేమో!