ఆకులు వదిలేస్తామా!

ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కొన్ని ఇళ్లల్లో పిల్లలే కాదు పెద్దలు కూడా ఆకుకూరలంటే ఇష్టపడరు. మరి ఏ రకంగా వీటిని తినిపించాలో తెలుసుకుందామా...రుచికరమైన వీటిని చిన్నాపెద్దా ఎంతో ఇష్టంగా తింటారు. వీటి తయారీలో పాలకూర, బచ్చలికూర, లెట్యూస్‌ లాంటి వాటిని చేర్చితే రుచి పెరుగుతుంది. పిల్లలూ, పెద్దలూ ఇష్టంగా తింటారు...

Published : 14 Aug 2021 00:41 IST

ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కొన్ని ఇళ్లల్లో పిల్లలే కాదు పెద్దలు కూడా ఆకుకూరలంటే ఇష్టపడరు. మరి ఏ రకంగా వీటిని తినిపించాలో తెలుసుకుందామా...

శాండ్‌విచ్‌లు.. రుచికరమైన వీటిని చిన్నాపెద్దా ఎంతో ఇష్టంగా తింటారు. వీటి తయారీలో పాలకూర, బచ్చలికూర, లెట్యూస్‌ లాంటి వాటిని చేర్చితే రుచి పెరుగుతుంది. పిల్లలూ, పెద్దలూ ఇష్టంగా తింటారు.

చట్నీలు... చాలామంది ఆవకాయ, మాగాయ లేకపోతే ముద్ద ముట్టుకోరు. వీటికి ప్రత్యామ్నాయంగా పుదీనా, కొత్తిమీరతో కలిపి రోటి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. అన్నంలోకే కాదు శాండ్‌విచ్‌లు, బర్గర్‌లు, చాట్‌లలోనూ దీన్ని వాడుకోవచ్చు.

కఢీ.. ఉత్తర భారతంలో పెరుగుతో చేసుకునే ప్రత్యేకమైన వంటకమిది. దీంట్లో శుభ్రం చేసిన పాలకూరను మిక్సీపట్టి పేస్ట్‌ వేస్తే సరి. ఇది ఈ కూరకు ప్రత్యేకమైన రుచిని ఆపాదించిపెడుతుంది.

పాస్తా... పాలకూర, ఇతర ఆకుకూరలను పేస్ట్‌ చేసి పాస్తాలో వేస్తే రుచి అమోఘంగా ఉంటుంది. చిన్నారులకు అందులో ఆకుకూరలు వేసినట్లు కూడా తెలియదు.

చిరుతిండి... బచ్చలికూర బజ్జీ, పాలకూర పకోడీ... ఇలా రకరకాలుగా చేసి తినిపించ వచ్చు. లేదా ఆకుకూరలతో కలిపి కారం కారంగా చాట్‌ చేసిపెట్టండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్