లాభాలు పండంత!

వేసవి వచ్చేసింది. ఎండలు చిటపటలాడుతున్నాయి. ఒంట్లోంచి చెమటలు కారడం, చిన్న పనికే అలసిపోవడం, చిరాకు, అసహనం... ఇదంతా మామూలే కదూ! అబ్బబ్బ.. ఇంకెన్ని రోజులిలా అవస్థపడాలి- అంటూ అశాంతికి లోనయ్యే బదులు  గ్రీష్మతాపం నుంచి బయట పడే మార్గాల గురించి ఆలోచించడం మేలు కదూ! అప్పుడు ముందుగా గుర్తొచ్చేది పుచ్చకాయ.. పైన ఆకుపచ్చగా, లోపల ఎర్రగా ఉండే పుచ్చకాయ పిల్లలకు మరీ మరీ ఇష్టం...

Published : 13 Apr 2022 00:45 IST

వేసవి వచ్చేసింది. ఎండలు చిటపటలాడుతున్నాయి. ఒంట్లోంచి చెమటలు కారడం, చిన్న పనికే అలసిపోవడం, చిరాకు, అసహనం... ఇదంతా మామూలే కదూ! అబ్బబ్బ.. ఇంకెన్ని రోజులిలా అవస్థపడాలి- అంటూ అశాంతికి లోనయ్యే బదులు  గ్రీష్మతాపం నుంచి బయట పడే మార్గాల గురించి ఆలోచించడం మేలు కదూ! అప్పుడు ముందుగా గుర్తొచ్చేది పుచ్చకాయ.. పైన ఆకుపచ్చగా, లోపల ఎర్రగా ఉండే పుచ్చకాయ పిల్లలకు మరీ మరీ ఇష్టం..

మనమంతా చర్మ సౌందర్యం కోసం తపిస్తాం. లేపనాలు రాస్తాం. అలాంటివేమీ అవసరం లేకుండా సహజంగానే చర్మం మృదువుగా, కాంతిమంతంగా ఉండాలంటే వీలైనంత తరచుగా పుచ్చకాయ తినండి. రుచికి రుచి, ఫలితానికి ఫలితం. ధర కూడా స్వల్పమే.

పుచ్చకాయలో 92 శాతం నీరే ఉంటుంది కనుక ఎండాకాలం చాలా మంచిది. చలవ చేస్తుంది. ఇందులో ఉండే ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, అమినో యాసిడ్‌లు, పొటాషియం, మెగ్నీషియం, ఎ, సి విటమిన్లు శరీరానికి మేలు చేసి శక్తినిస్తాయి. వ్యాయామం ముగియగానే పుచ్చకాయ ముక్కల రూపంలో తిన్నా జ్యూస్‌ చేసుకుని తాగినా వెంటనే అలసట తగ్గి ఉత్సాహంగా ఉంటుంది. ఆనక వంట చేసేటప్పుడు అంత అలసట అనిపించదు.

ఎండాకాలం ఎన్ని నీళ్లు తాగినా ఆవిరైపోతుంటాయి. డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తితే సెలైన్‌ ఎక్కించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా వేసవిలో రోజూ పుచ్చకాయ ముక్కలు తింటే సరి. కెలొరీలు తక్కువ కనుక బరువు పెరిగే సమస్యే ఉండదు.

పుచ్చకాయ శారీరకంగానే కాదు, మానసిక ఆరోగ్యానికీ మంచిది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఇది కళ్లకు మంచిది. వయసును బట్టి వచ్చే చత్వారం పుచ్చకాయ తరచుగా తినేవాళ్లలో చాలా అరుదని నిపుణులు చెబుతున్నారు.

పుచ్చకాయ కండరాలను దృఢంగా ఉంచుతుంది. ఇది గుండెకు మంచిదని పరిశోధనల్లో తేలింది. ఇందులో ఉండే లైకోపెనే రక్తపోటును, కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్