పొరపాటు చేస్తున్నారేమో..!

అందం, ఆరోగ్యం, బరువు తగ్గడం.. కారణమేదైనా వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకుంటున్న అమ్మాయిలెందరో! సమస్యల్లా.. ఫలితం త్వరగా రావాలనే. దీంతో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. మీరూ చేస్తున్నారేమో.. చెక్‌ చేసుకోండి.

Updated : 07 Jul 2022 00:39 IST

అందం, ఆరోగ్యం, బరువు తగ్గడం.. కారణమేదైనా వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకుంటున్న అమ్మాయిలెందరో! సమస్యల్లా.. ఫలితం త్వరగా రావాలనే. దీంతో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. మీరూ చేస్తున్నారేమో.. చెక్‌ చేసుకోండి.

* అతి వద్దు.. స్నేహితుల ప్రభావమో, వైద్యుల సలహాతోనో వ్యాయామం మొదలుపెడుతుంటారు కొందరు. కొత్త కాబట్టి, మొదట్లో ఉత్సాహం సాధారణమే. ఇంకేముంది ఒక్కసారిగా అన్నీ చేసేస్తుంటారు. దానివల్ల దుష్ఫలితాలే ఎక్కువ. 20-30 నిమిషాల నుంచి మొదలుపెట్టి తర్వాత క్రమంగా పెంచుకోవడం మేలు. ఒకేసారి కఠిన వ్యాయామాలూ మంచిది కాదు. చిన్నచిన్న వాటితో మొదలుపెట్టాలి.

* విరామముందా? ఏకధాటిగానూ చేసుకుంటూ వెళ్లొద్దు. ఒక సెట్‌ పూర్తవగానే కనీసం 20 సెకన్ల విరామమివ్వాలి. లేదంటే శరీరం అలసిపోవడమే కాదు.. ఇన్‌ఫ్లమేషన్‌, వ్యాధినిరోధకతపై ప్రభావం వంటివీ ఏర్పడొచ్చు.

* వార్మప్‌ చేయాలి.. ఉదయం లేవగానే వ్యాయామం మొదలు పెట్టేస్తున్నారా? ఇదీ శరీరానికి చేటే. చాలామంది వ్యాయామానికే చాలా కష్టంగా సమయం కేటాయిస్తున్నాం. ఇక వార్మప్పా అంటుంటారు. నిద్ర లేవగానే ఏదైనా పని ఇచ్చి చేయమంటే తికమక పడతారా లేదా? శరీరమూ అంతే! దానికి కొంత సన్నద్ధత కావాలి. వార్మప్‌ అదే చేస్తుంది. శరీరాన్నీ, మనసునీ సంసిద్ధం చేస్తుంది. కాబట్టి ఓ 5 నిమిషాలైనా కేటాయించండి.

* నొప్పా?... ఒక్కోరోజు ఊరికే అలసిపోవడం, ఒళ్లంతా నొప్పులు లాంటివి అనిపిస్తున్నాయా? చేయాలన్నా మనసు రావడం లేదు కాబోలు. అయినా వెనకపడి పోతామన్న భయం. దీంతో బలవంతంగా కొనసాగిస్తుంటారు. ఆరోగ్యం బాలేనపుడు ఆహారం సహించదు కదా! వ్యాయామమూ అంతే. ఇలా ఏమైనా అనిపిస్తే ఆరోజుకి మానేయండి. ఫర్లేదు. బలవంతంగా చేయడం వల్ల ఒంటికి హానే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్