పేరు మార్చుకోవాలనుకుంటున్నా!

నాకు మా తాతమ్మ పేరే పెట్టారు. అది ఎబ్బెట్టుగా ఉండటంతో...స్కూలు వయసు నుంచీ స్నేహితులు ఆటపట్టిస్తున్నారు. ఇప్పుడు బీటెక్‌ నాలుగో ఏడాది చదువుతున్నా. భవిష్యత్తులో ఉద్యోగం

Updated : 13 Sep 2021 06:10 IST

నాకు మా తాతమ్మ పేరే పెట్టారు. అది ఎబ్బెట్టుగా ఉండటంతో...స్కూలు వయసు నుంచీ స్నేహితులు ఆటపట్టిస్తున్నారు. ఇప్పుడు బీటెక్‌ నాలుగో ఏడాది చదువుతున్నా. భవిష్యత్తులో ఉద్యోగం చేసినా, పెళ్లి చేసుకున్నా... ఈ ఇబ్బంది ఉండకూ డదని పేరు మార్చుకోవాలనుకుంటున్నా. దాన్ని చట్టబద్ధంగా ఎలా చేసుకోవాలి?

- ఓ సోదరి, హైదరాబాద్‌

ట్ట ప్రకారం పేరు మార్చుకోవడానికి ఓ పద్ధతుంది. ముందు మీరు పేరెందుకు మార్చుకోవాలనుకుంటున్నారు? పుట్టినప్పుడు పెట్టిన పేరేంటి? ఇప్పుడు ఎలా మార్చుకుంటున్నారు వంటి వివరాలన్నీ తెలియజేస్తూ అఫిడవిట్‌ రాయండి. అంటే...ఓ రాత పత్రాన్ని సిద్ధం చేసుకుని దాన్ని నోటరీ చేయించండి. ఆపై పేరు మార్చుకుంటున్నట్లుగా పత్రికా ప్రకటన ఇవ్వాలి. తర్వాత గెజిట్‌ పబ్లికేషన్‌ కోసం సెక్రటేరియట్‌లో ఓ విభాగం ఉంటుంది. పేర్ల మార్పిడికి సంబంధించిన విషయాలను అది పరిశీలిస్తుంది. వారికి చిరునామా, ఫొటోలు, ఆధార్‌, పత్రికా ప్రకటనతో పాటు నామమాత్రపు రుసుము రసీదు జతచేసి ఇవ్వాలి. అప్పుడు సంబంధిత విభాగం ఆ వివరాలను గెజిట్‌ పబ్లికేషన్‌కి పంపిస్తుంది. అది సుమారు నెలలోపు ప్రింటు అవుతుంది. తర్వాత దాన్ని ఆధారంగా చూపి స్టడీ సర్టిఫికెట్లు, అధికారిక పత్రాలన్నింటిలోనూ పేరుని మార్చుకోవచ్చు. అయితే ముందు పాఠశాల ధ్రువపత్రాల్లో మారితే...మిగిలిన అన్నీ సులువుగా పూర్తవుతాయి. ఇందుకు చాలా సమయం పట్టొచ్చు. అన్నింటికీ కలిపి సుమారు ఐదువేల రూపాయల వరకూ ఖర్చు అవ్వొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని