అత్తింటివారి నగలు తిరిగి ఇచ్చేయాలా?
నాకు 30 ఏళ్లు. మూడేళ్ల కిందట పెళ్లైంది. ఈమధ్యే మావారు కొవిడ్‌తో చనిపోయారు. ఇప్పుడు మా అత్తింటివారు పెళ్లప్పుడు నాకు కానుకగా ఇచ్చిన నగలు తిరిగి ఇమ్మంటున్నారు. చట్టపరంగా తిరిగి వాటిని ఇచ్చేయాలా?
నాకు 30 ఏళ్లు. మూడేళ్ల కిందట పెళ్లైంది. ఈమధ్యే మావారు కొవిడ్‌తో చనిపోయారు. ఇప్పుడు మా అత్తింటివారు పెళ్లప్పుడు నాకు కానుకగా ఇచ్చిన నగలు తిరిగి ఇమ్మంటున్నారు. చట్టపరంగా తిరిగి వాటిని ఇచ్చేయాలా?
- అనోఖా
అలా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆడపిల్లకు పుట్టింటి వారైనా, అత్తింటివారైనా, పెళ్లప్పుడైనా, పెళ్లికి ముందూ, వెనకా ఇచ్చిన ఆస్తుల మీద ఆమెకే పూర్తి హక్కులుంటాయి. అది ఆమె స్వార్జితం. భర్త పోయిన మిమ్మల్ని ఆ నగలు తిరిగి ఇమ్మని అడగడం భావ్యం కాదు. కాని వారి పరిస్థితి ఏమిటో తెలియదు. వాళ్లకు ఇల్లు గడిచే పరిస్థితి ఉందా? మీ అత్తామామలకు మీవారు కాకుండా ఇంకా కొడుకులు, కూతుళ్లు ఉన్నారా? వారిని పోషించుకునే పరిస్థితి, వేరే ఆధారం లేకపోతే, మీరూ ఉద్యోగం చేస్తూంటే వారి గురించి ఆలోచించండి.సెక్షన్-22, హిందూ అడాప్షన్ అండ్ మెయిన్‌టెనెన్స్ యాక్ట్ ప్రకారం డిపెండెంట్స్ కింద తమను తాము పోషించుకోలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు, పిల్లలు, తల్లీదండ్రీ లేని మనుమలు, మనుమరాళ్లు, వితంతు కోడలు (మళ్లీ పెళ్లి చేసుకునే వరకు).. వీరందరినీ చేర్చారు. కానీ అత్త మామల దగ్గర నుంచి ఆస్తి తీసుకుంటే వారు తమని పోషించుకోలేని స్థితిలో ఉంటే ఆ ఆస్తి నుంచి వచ్చే ఆదాయంలో కొంతభాగం వారికి భత్యం కింద ఇవ్వాలని సెక్షన్- 23 చెబుతోంది. పైన చెప్పిన పరిస్థితులుంటే మధ్యవర్తులను పెట్టి మాట్లాడుకోండి. లేదంటే మీరు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.