గడ్డంపై అవాంఛిత రోమాలు..

వయసు 26. నాకు ఇంతకు ముందు గడ్డం మీద ఒకట్రెండు మినహా వెంట్రుకలు ఉండేవి కాదు. ఇప్పుడేమో బాగా కనిపిస్తున్నాయి. త్రెడింగ్‌ చేయిస్తే ఆ ప్రాంతమంతా నల్లగా తయారవుతోంది. వెంట్రుకలూ

Published : 18 Sep 2022 00:39 IST

వయసు 26. నాకు ఇంతకు ముందు గడ్డం మీద ఒకట్రెండు మినహా వెంట్రుకలు ఉండేవి కాదు. ఇప్పుడేమో బాగా కనిపిస్తున్నాయి. త్రెడింగ్‌ చేయిస్తే ఆ ప్రాంతమంతా నల్లగా తయారవుతోంది. వెంట్రుకలూ మందంగా వస్తున్నాయి. సమస్యేంటి? పోగొట్టుకునే మార్గాలను చెప్పండి

- ఓ సోదరి

పీసీఓఎస్‌ కారణమవొచ్చు. ఇదో హార్మోనల్‌ డిజార్డర్‌. దీనివల్ల కొందరిలో పిల్లలు పుట్టడం ఆలస్యమవడంతోపాటు అవాంఛిత రోమాలు, తలపై జుట్టు తగ్గడం, లావు అవ్వడం, యాక్నే వంటివి కనిపిస్తాయి. హర్సెటిజం అయితే వీపు, ఛాతీభాగం, ముఖం ఇలా అన్నిప్రాంతాల్లో కనిపిస్తాయి. కంజునైటల్‌ అడ్రినల్‌ హైపర్‌ ప్లేసియా.. వంశపారంపర్యంగా వస్తుంది. కార్టిసాల్‌, ఆండ్రోజన్‌ వంటివి ఎక్కువగా ఉత్పత్తయ్యి అవాంఛిత రోమాలకు దారితీస్తుంది. కొందరు తలపై వెంట్రుకలు రాలిపోతున్నాయని మినాక్సిడల్‌ సొల్యూషన్‌ వాడుతుంటారు. అతిగా వాడుతోంటే ముఖంపై వెంట్రుకలూ ప్రభావితమయ్యే అవకాశముంది. డానజోల్‌, టెస్టోస్టీరాన్‌ సంబంధిత మందులు వాడినా ఎక్కువవుతాయి. ఇంట్లో ఎవరికైనా ఉన్నా వంశ పారంపర్యంగా వస్తుంది. దీన్ని షేవింగ్‌, వాక్సింగ్‌, త్రెడింగ్‌ ఏవి చేయించినా ఫలితం తాత్కాలికమే. బర్త్‌ కంట్రోల్‌ పిల్స్‌, యాంటీ ఆండ్రోజన్‌ బ్లాకర్స్‌ వాడటం ద్వారా కొంతవరకూ తగ్గించొచ్చు. శాశ్వతంగా పోగొట్టుకోవాలంటే లేజర్‌, ఎలక్ట్రాసిస్‌ ఎంచుకోవడం మంచిది. లేజర్‌.. హెయిర్‌ ఫాలికల్స్‌పై ప్రభావం చూపి పెరగకుండా చేస్తుంది. కనీసం 6 సిట్టింగ్‌లు తీసుకోవాలి. అయితే ఇది తెల్ల వెంట్రుకలపై మాత్రం పనిచేయదు. తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. అయితే లేజర్‌ చేయించే కనీసం ఆరు వారాల ముందు వరకూ ఆ వెంట్రుకలను కదల్చకూడదు.  అప్పుడే ఏ హానీ ఉండదు. అయితే ముఖం మీద వీటి ప్రభావమూ 70 శాతమే. ఎలక్ట్రాలిసిస్‌ ద్వారా మాత్రం 100 శాతం పోగొట్టుకోవచ్చు. దీనిలో కరెంటు హెయిర్‌ ఫాలికిల్స్‌పై ప్రభావం చూపి శాశ్వతంగా పోయేలా చేస్తుంది. అయితే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఖర్చు కూడా. అందుకే రెండింటినీ మిక్స్‌ చేసి చేస్తుంటాం. ఖర్చు, సమయం ఆదా అవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్