ఏడాది పొడవునా సమస్య!

నాకు పాదాలు విపరీతంగా పగులుతాయి. ఏడాది పొడవునా ఇదే సమస్య. దీనికితోడు మృతకణాలూ పెరిగిపోతున్నాయి. పగుళ్ల నుంచి రక్తం కూడా వస్తోంది.

Published : 19 Feb 2023 00:17 IST

నాకు పాదాలు విపరీతంగా పగులుతాయి. ఏడాది పొడవునా ఇదే సమస్య. దీనికితోడు మృతకణాలూ పెరిగిపోతున్నాయి. పగుళ్ల నుంచి రక్తం కూడా వస్తోంది. రోజూ కొబ్బరి నూనె రాస్తున్నా. అయినా మార్పు లేదు. ఏం చేయాలి?

- ఓ సోదరి

పాదాల చర్మం పొడిబారడం, ఎగ్జిమా, సొరియాసిస్‌, హైపర్‌ హైడ్రోసిస్‌.. ఇలా దీనికి బోలెడు కారణాలు. ఎర్రగా, పగిలినట్లుగా ఉండి.. దురద, మంటలతోపాటు చర్మం రాలుతోంటే అథ్లెట్‌ ఫూట్‌ అంటాం. ఇది ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌. ఇతరులకూ సోకే ప్రమాదం ఉంది. దీనికి యాంటీ ఫంగల్‌ క్రీములు, మందులు వాడాలి. పాదాలను శుభ్రం చేసుకొని మాయిశ్చరైజ్‌ చేస్తుండాలి. బాగా వేడి నీటి స్నానాలకు దూరంగా ఉండాలి. సాక్సులు, షూలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. మృతకణాలు ఎక్కువగా వస్తోంటే ఎగ్జిమా కూడా అయ్యుండొచ్చు. దీన్ని ఎటోపిక్‌ డెర్మటైటిస్‌ అనీ అంటాం. చర్మం ఎర్రబడి దురదతోపాటు దానిపై పగుళ్లలా కనిపిస్తుంది. దీనికి కారణాలేంటో చెప్పలేం. మాయిశ్చరైజర్‌, టాపికల్‌ స్టెరాయిడ్‌లతోపాటు యాంటీ హిస్టమిన్‌ మందులు తీసుకోవాలి. ఎర్రటి ప్యాచ్‌లపై వెండి రంగులో పొరల్లా కనిపిస్తోంటే సొరియాసిస్‌. ఒత్తిడి, మృతకణాలు పోగుపడటం వల్ల వస్తుంది. పదేపదే కాళ్లు కడగొద్దు. మాయిశ్చరైజర్‌ 5-6సార్లు రాయడం, ఆపై సాల్సిలిక్‌ యాసిడ్‌ స్టెరాయిడ్‌ క్రీములు పూయడం, శుభ్రమైన సాక్సు వేయడం తప్పనిసరి. పాదాలకు బాగా చెమటలు పోయడం ద్వారా వస్తోంటే హైపర్‌ హైడ్రోసిస్‌గా చెబుతాం. అల్యూమినియం క్లోరైడ్‌ ద్రవాన్ని రోజూ రాత్రి రాయాలి. వీటిల్లో సమస్య ఏదైనా పాదాలు తేమగా ఉంచుకోవడం తప్పనిసరి. మృతకణాలు పోవడానికి ఆల్ఫా హైడ్రాక్సి యాసిడ్స్‌, లాక్టిక్‌, గ్లైకాలిక్‌ యాసిడ్‌, సాల్సిలిక్‌ యాసిడ్‌ క్రీములూ రాయడం.. స్నానం చేసినప్పుడు ప్యూమిక్‌ స్టోన్‌తో రుద్దడం అలవాటు చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్