పాప మెడ నల్లగా..

ఎకాంథసిస్‌ నెగ్రికా అని కూడా అంటారు. కణుపులు, మోచేతులు, మోకాళ్లు, మెడ, బాహుమూలల్లో మందంగా నల్లగా కనిపిస్తుంది. ఇన్ఫెక్షన్‌ కాదు, వ్యాప్తీ చెందదు. కాబట్టి భయపడాల్సిన పనిలేదు. పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. బొద్దుగా ఉన్నా, రక్తంలో ఇన్సులిన్‌ స్థాయులు ఎక్కువగా ఉన్నా ఇలా జరుగుతుంది.

Published : 25 Jun 2023 00:15 IST

మా పాపకి పదేళ్లు. కాస్త బొద్దుగా ఉంటుంది. మోచేతులు, మెడ చుట్టూ నల్లగా మారుతోంది. తగ్గాలంటే ఏం చేయాలి?

- ఓ సోదరి

కాంథసిస్‌ నెగ్రికా అని కూడా అంటారు. కణుపులు, మోచేతులు, మోకాళ్లు, మెడ, బాహుమూలల్లో మందంగా నల్లగా కనిపిస్తుంది. ఇన్ఫెక్షన్‌ కాదు, వ్యాప్తీ చెందదు. కాబట్టి భయపడాల్సిన పనిలేదు. పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. బొద్దుగా ఉన్నా, రక్తంలో ఇన్సులిన్‌ స్థాయులు ఎక్కువగా ఉన్నా ఇలా జరుగుతుంది. వంశపారంపర్యం కావొచ్చు. డయాబెటిస్‌, నెలసరి మొదలైతే పీసీఓఎస్‌, హార్మోనుల్లో అసమతుల్యత ఉన్నాయేమో చెక్‌ చేయించండి. నలుపుదనంతోపాటు దురద, దద్దుర్లు, ఎర్రగా మారడం కనిపిస్తే ఎగ్జిమా కావొచ్చు. అలాంటప్పుడు మాత్రం మందులు, యాంటీ ఫంగల్‌ క్రీములు వాడాల్సి ఉంటుంది. నెలసరి మొదలవకపోయినా, దురద లక్షణాలు కనిపించకపోయినా భయపడక్కర్లేదు. పాప ఎదిగేకొద్దీ నలుపుదనం తగ్గిపోతుంది. అమ్మాయి బొద్దుగా ఉంటుంది అంటున్నారు. వయసు, ఎత్తుకు తగ్గ బరువుందా? ఎక్కువగా ఉంటే ఆరోగ్యకరమైన ఆహారం ఇస్తూ వ్యాయామం తప్పనిసరిగా చేసేలా చూసుకోండి. చక్కెరలు, కార్బోహైడ్రేట్లు, జంక్‌ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉంచాలి. అంతేకానీ క్రీములు, బ్లీచ్‌, స్క్రబ్‌లు వంటివి చేయించొద్దు. సరిగా స్నానం చేయడం లేదని గట్టిగా రుద్దడం వంటివీ చేయొద్దు. బాదం పొడికి తగినన్ని పాలు కలిపిగానీ వాల్‌నట్‌ పొడి.. పెరుగు మిశ్రమాన్నిగానీ, తేనె, టొమాటో రసం లేదా ఆలివ్‌నూనె, నిమ్మరసం కలిపిగానీ సమస్య ఉన్నచోట రాసి, 20 నిమిషాలయ్యాక కడిగేస్తే సరి. ఆరోగ్యకరమైన జీవనశైలితోపాటు వీటిల్లో రోజూ ఏదోకదాన్ని ప్రయత్నించండి. సమస్య తీరుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని