ఇప్పుడేం పుట్టుమచ్చలు?

వయసు 28. చిన్నతనంలో ముఖంపై మచ్చలేమీ లేవు. కానీ కొన్నేళ్లుగా చిన్న చిన్నగా పుట్టుమచ్చల్లా వస్తున్నాయి. ఇప్పుడేంటిలా? ఇదేమైనా సమస్యా? తగ్గించుకునే వీలుందా?

Published : 02 Jul 2023 00:25 IST

వయసు 28. చిన్నతనంలో ముఖంపై మచ్చలేమీ లేవు. కానీ కొన్నేళ్లుగా చిన్న చిన్నగా పుట్టుమచ్చల్లా వస్తున్నాయి. ఇప్పుడేంటిలా? ఇదేమైనా సమస్యా? తగ్గించుకునే వీలుందా?

- ఓ సోదరి

ఈ మచ్చలను మూల్‌ లేదా నావే అంటాం. చిన్నతనంలో స్కూల్లో చేర్చేప్పుడు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయా అని తెగ వెదికితే ఎక్కడో ఒక్కటి కనిపిస్తుంది. అదే పెద్దయ్యాక చూడండి.. చాలా కనిపిస్తుంటాయి. మామూలుగానే ఒక వ్యక్తికి 10-40 వరకు ఉంటాయి. ఎదిగేకొద్దీ మన చర్మంలో ఉండే మెలనోసైట్స్‌ ఒకచోట చేరడం వల్ల ముదురు గోధుమ, నలుపు రంగుల్లో పుట్టుమచ్చలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. కొందరిలో ఉబ్బెత్తుగానూ వస్తుంటాయి. ఒక్కోసారి వీటి రంగు తగ్గడం, పెరగడాన్నీ గమనించొచ్చు. ఇంకా కొందరిలో కళ్లచుట్టూ, బుగ్గలు, ముక్కు దగ్గర లేత గోధుమ రంగులో కుప్పలుగా వస్తాయి. ఇవీ పుట్టమచ్చల్లా అనిపిస్తాయి. కానీ కాదు. వీటిని డెర్మటోసిస్‌ పాప్యులస్‌ నీగ్రా, ఫ్రికెల్స్‌ అని అంటాం. ఎండకి బాగా తిరగడం, వంశపారంపర్యం వల్ల వస్తుంటాయి. ఇవి ట్రీట్‌మెంట్‌తో పోతాయి. కొంతమందిలో వాటంతటవే తగ్గుతుంటాయి కూడా. ఏదేమైనా చాలావరకూ వీటివల్ల ప్రమాదమేమీ ఉండదు. అతి కొద్దిమందిలో మాత్రం క్యాన్సర్‌ అవకాశాలుంటాయి. ఒక స్థిరమైన రూపులో లేకపోవడం, ఒకే పుట్టుమచ్చలో 2-3 రంగులు కనిపించడం.. పరిమాణం, రూపు, ఎత్తుల్లో మార్పులొస్తోంటే మాత్రం వైద్యులను సంప్రదించండి. ఇవేమీ లేకపోయినా చూడటానికి బాలేదు అనిపిస్తే సర్జరీ చేయించుకోవచ్చు. అయితే పుట్టుమచ్చలు తీసినా మళ్లీ వచ్చేస్తుంటాయి. మీ ముఖం మీదవి ఫ్రికెల్స్‌ కావొచ్చు. ఎండ బాగా ఉన్నప్పుడు బయటికి వెళ్లొద్దు. వెళ్లాల్సొస్తే సన్‌స్క్రీన్‌ రాసుకోవడం, ముఖాన్ని వస్త్రం లేదా గొడుగుతో కప్పేసుకుంటే మరీ ముదురు రంగులోకి మారకుండా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్