మోకాళ్లు నలుపు..
మోకాళ్లు, మోచేతులు నల్లగా అయ్యాయి. తక్కిన చర్మంతో పోలిస్తే చాలా తేడాగా కనిపిస్తున్నాయి. కొన్నిరకాల దుస్తుల్లో మరీ ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయి. పోగొట్టుకునే మార్గాలు చెప్పండి.
మోకాళ్లు, మోచేతులు నల్లగా అయ్యాయి. తక్కిన చర్మంతో పోలిస్తే చాలా తేడాగా కనిపిస్తున్నాయి. కొన్నిరకాల దుస్తుల్లో మరీ ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయి. పోగొట్టుకునే మార్గాలు చెప్పండి.
- ఓ సోదరి
భోజనం చేసేప్పుడు, తీక్షణంగా చదివేటప్పుడు, సిస్టమ్ మీద పనిచేసేప్పుడు.. తరచూ మోకాళ్ల మీద కూర్చోవడం వల్లా మోచేతులు, మోకాళ్లు రాపిడికి గురవుతాయి. ఫలితంగా అక్కడి చర్మం నలుపెక్కుతుంది. మృతకణాలు పేరుకున్నా.. కొన్నిసార్లు ఎగ్జిమా, సొరియాసిస్ తగ్గాక లేదా దెబ్బలు తగిలి మానినా అలా కనిపిస్తాయి. గర్భనిరోధక మాత్రలు వాడేవారిలో, ఇటీవలే ప్రసవం అయినా ఈ సమస్య తలెత్తుతుంది. ముఖంతోపాటు వీటికీ తరచూ మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వాడాలి. ఎబ్బెట్టుగా కనిపిస్తోంది అంటున్నారు కాబట్టి.. ఆల్ఫా, బీటా హైడ్రాక్సి యాసిడ్లు, హైడ్రోక్వినాన్, కార్టికోస్టెరాయిడ్స్, టాపికల్ రెటినాల్ క్రీములు వాడండి. కెమికల్ పీల్స్‌నీ ప్రయత్నించొచ్చు. రాపిడి జరగకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది.
వారానికి రెండుసార్లు చక్కెరలో తగినన్ని నీళ్లు కలిపి స్క్రబ్ చేయాలి. రోజూ రెండుసార్లు కలబంద గుజ్జును రాసినా మంచిదే. బేకింగ్ సోడాలో తగినన్ని నీళ్లు కలిపి కానీ, స్పూను ఓట్‌మీల్‌కి తగినంత పెరుగు కలిపిగానీ స్పూను చొప్పున పెరుగు, నిమ్మరసం, తేనె, కొన్ని చుక్కలు కొబ్బరి, ఆలివ్ నూనె మిశ్రమాన్ని కానీ ప్యాక్‌లా వేసి, ఆరాక కడిగేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే సరి. వీటిని చేస్తూనే టాపికల్ క్రీములు వాడితే మంచిది. ఇది అనారోగ్య సమస్యేమీ కాదు. వంశపారంపర్యం, మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్లా ఇలా అవుతుంది. కాబట్టి, కంగారుపడొద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.