ముడతలు.. వాటి వల్లేనా?
వయసు 30. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని. 8-10 గంటలు సిస్టమ్ ముందే గడిపేస్తా. ముఖమ్మీద చర్మం సాగినట్లుగా అవుతోంది. మెడ, కళ్లు, నోటిచుట్టూ ముడతల్లా వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాల ప్రభావం వల్లేనా? తగ్గించుకునే మార్గం చెప్పండి.
వయసు 30. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని. 8-10 గంటలు సిస్టమ్ ముందే గడిపేస్తా. ముఖమ్మీద చర్మం సాగినట్లుగా అవుతోంది. మెడ, కళ్లు, నోటిచుట్టూ ముడతల్లా వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాల ప్రభావం వల్లేనా? తగ్గించుకునే మార్గం చెప్పండి.
- ఓ సోదరి
ఎలక్ట్రానిక్ పరికరాల నీలికాంతి ప్రభావం చర్మంపై తప్పక ఉంటుంది. తీక్షణంగా పనిచేసే క్రమంలో ముఖకవళికలూ ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా ముడతలకు కారణాలే. వయసుతోపాటు చర్మం సాగుతుంది. ముఖంపై కొవ్వూ తగ్గుతుంది. పొడిచర్మం ఉన్నవారిలో, ఎండలో ఎక్కువ తిరుగుతున్నా ఈ సమస్య పెరుగుతుంది. డే, నైట్ క్రీములను వాడండి. పగలు విటమిన్ సి, హైలురోనిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, నియాసినమైడ్ ఉన్నవాటితోపాటు సన్‌స్క్రీన్ తప్పనిసరి. పెప్టైడ్స్, రెటినాల్ ఉన్నవి రాత్రి వాడితే కొల్లాజెన్ పెరుగుతుంది. ఎక్కువగా కనిపిస్తోంటే మైక్రోడెర్మాబ్రేషన్, లేజర్ థెరపీ, కెమికల్ పీల్స్‌తో, ఇంజెక్టబుల్ ఫిల్లర్స్, బొటాక్స్‌లతో కనిపించకుండా చేయొచ్చు. కళ్లకి విటమిన్ సి, పెప్టైడ్స్ ఉన్న అండర్ ఐ క్రీమ్‌లను వాడాలి. మేకప్‌కి దూరంగా ఉండండి. తప్పక వేసుకున్నా ఇంటికి రాగానే తొలగించాలి. ఒత్తిడిపైనా దృష్టిపెట్టండి. సమతులాహారం తీసుకుంటున్నారా.. చెక్ చేసుకోండి. తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోండి. ఆలస్యంగా పడుకొని, లేవడం మీ ఉద్యోగంలో మామూలే. అలా 8 గం. పడుకున్నా జరిగే మేలు తక్కువే. రాత్రి 10కల్లా పడుకుంటే మంచిది. 2-3 లీటర్ల నీరు తాగాలి. ఆలివ్ నూనెని రోజూ రాత్రి రాసుకోండి. దానిపై రెటినాల్, పెప్టైడ్ క్రీములను రాసుకోవచ్చు. ఆలివ్ నూనెలో తేనె, గ్లిజరిన్ సమపాళ్లలో తీసుకొని ముఖానికి పట్టించి, కొద్దిసేపు మసాజ్ చేసి కడిగేయాలి. వారంలో నాలుగు రోజులు కలబంద గుజ్జులో విటమిన్ ఇ నూనె కలిపి రాసుకొని ఆరాక కడిగేసుకుంటే సరి. వీటితో చర్మానికి కావాల్సిన తేమ అంది, ముడతలు తగ్గుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.