రజస్వల అయ్యాకే.. ఇలా!

మా పాప వయసు 13 ఏళ్లు. ఏడాదిగా తన జుట్టు మొత్తం ఊడిపోతోంది. మాడంతా కనిపించే పరిస్థితి. ఒకసారి గుండు చేయించినా, మందులు వాడినా ఫలితం లేదు.

Published : 01 Oct 2023 01:48 IST

మా పాప వయసు 13 ఏళ్లు. ఏడాదిగా తన జుట్టు మొత్తం ఊడిపోతోంది. మాడంతా కనిపించే పరిస్థితి. ఒకసారి గుండు చేయించినా, మందులు వాడినా ఫలితం లేదు. రజస్వల అయ్యాకే ఇలా జరుగుతోంది. పరిష్కారం సూచించగలరు.

- ఓ సోదరి

తలంతా ఖాళీ అయ్యేలా జుట్టు ఊడుతోందంటే దానికి కారణాలు బోలెడు. టీనియా కాపిటిస్‌ అనే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్లా మాడంతా పొట్టు రాలుతూ ప్యాచులుగా జుట్టు ఊడుతుంది. నల్లని మచ్చలు, దురద కూడా ఉంటాయి. ఇదైతే వారం నుంచి నెలరోజుల్లోగా తిరిగి జుట్టొస్తుంది. దీనికి ఓరల్‌ యాంటీ ఫంగల్‌ మందులు వాడాలి. అలోపేసియా ఏరియేటా ఎక్కువగా 30ఏళ్లలోపు వారికి అదీ వెయ్యిమందిలో ఒకరికి వస్తుంది. ప్యాచులుగా కురులు రాలతాయి. ఇది శరీరంలో ఎక్కడైనా రావొచ్చు. ఎరుపు, పొట్టు రాలడం ఉండవు. కొంతమందిలో దీనికి అదనంగా బొల్లి, సొరియాసిస్‌ వంటివీ కనిపిస్తాయి. రెటిక్యులర్‌ అలోపేసియా, సోఫియాసిస్‌ అలోపేసియా, డిఫ్యూజ్‌ అలోపేసియా, అలోపేసియా టొటాలిస్‌ల్లో వెంట్రుకలే మిగలవు. అలోపేసియా ఇన్‌వర్సాలిస్‌ శరీరమంతా వచ్చి, దానంతటదే నయమవుతుంది. తగ్గకపోతే గ్లూకో కార్టికాయిడ్స్‌ని ఇంజెక్ట్‌ చేస్తాం. పిల్లలకు మినాక్సిడల్‌ ద్రావణాలు, కొన్నిసార్లు ఓరల్‌ స్టెరాయిడ్స్‌, యూవీ థెరపీలను సూచిస్తాం. స్టైలింగ్‌, లాగి జడవేయడం, హెయిర్‌ ఎక్స్‌టెన్షన్లు వంటి వాటితో పాటూ ట్రామాతో కూడా జుట్టు ఊడుతుంది. ట్రైకో థీలియో మానియా.. వాళ్లకు వాళ్లే జుట్టు లాక్కోవడం, వెంట్రుకలు పీకేయడమనే అలవాటు ఉంటుంది. తల మీదే కాదు.. కనుబొమలు కూడా పీకేస్తుంటారు. దీనికి కౌన్సెలింగ్‌ తీసుకోవాల్సి ఉంటుంది. మలేరియా, టైఫాయిడ్‌, ఒత్తిడికి సంబంధించి మందులు వాడినా డైట్‌ పేరుతో సరిగా తినకపోయినా కురులు రాలతాయి. చాలావరకూ ఆరునెలల్లో తిరిగి పెరుగుతాయి. పీరియడ్స్‌ సరిగా వస్తున్నాయా? హార్మోనుల్లో అసమతుల్యత, ఐరన్‌, ప్రొటీన్‌, విటమిన్ల లోపం కూడా కారణాలే. ఇవన్నీ చెక్‌ చేయించుకొని తగ్గ చికిత్స తీసుకుంటే సమస్య తగ్గుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్