జీవితాంతం తప్పదా?

లేజర్‌ చికిత్స తీసుకుంటున్నా. ఆరు సిట్టింగులు అయిపోయాయి. అయినా పెదాలు, గడ్డంపై వెంట్రుకలు కనిపిస్తూనే ఉన్నాయి. మరో రెండు తీసుకోండి.. క్రమంగా తగ్గుతాయి.

Published : 29 Oct 2023 01:25 IST

లేజర్‌ చికిత్స తీసుకుంటున్నా. ఆరు సిట్టింగులు అయిపోయాయి. అయినా పెదాలు, గడ్డంపై వెంట్రుకలు కనిపిస్తూనే ఉన్నాయి. మరో రెండు తీసుకోండి.. క్రమంగా తగ్గుతాయి. ఆపై అడపాదడపా చేయించుకుంటే సరిపోతుంది అంటున్నారు. ఇలా జీవితాంతం చేయించుకుంటూనే ఉండాలా? అసలెన్ని సిట్టింగులు సరిపోతాయి?

- ఓ సోదరి

లేజర్‌ కుదుళ్లపై ప్రభావం చూపి, వాటిని నాశనం చేస్తుంది. వెంట్రుకలు యాక్టివ్‌, పాసివ్‌ అనే రెండు దశల్లో ఉంటాయి. లేజర్‌ యాక్టివ్‌గా ఉన్నవాటిపై ప్రభావం చూపుతుంది. విశ్రాంత దశలో ఉన్నవి ఆ సమయంలో తప్పించుకుంటాయి. అందుకే అన్ని సిట్టింగ్స్‌ అవసరమవుతాయి. ఇది నల్లగా, మందంగా ఉన్న వెంట్రుకలపై చాలా బాగా పనిచేస్తుంది. అదీ సవ్యంగా సాగాలంటే చేయించుకోవడానికి కనీసం ఆరు వారాల ముందే త్రెడింగ్‌, వ్యాక్సింగ్‌ వంటివి ఆపేయాలి. ఎండలోనూ ఎక్కువగా తిరగకూడదు. వీటిని పాటించారేమో చెక్‌ చేసుకోండి. ఇంకా.. పైపెదవిపై రోమాలు మామూలే! గడ్డంపై ఎక్కువగా వస్తున్నాయంటే పీసీఓఎస్‌, హార్మోనుల్లో అసమతుల్యత కూడా కారణం కావొచ్చు. హెర్సిటిజం, మెనోపాజ్‌, దీర్ఘకాలంలో స్టెరాయిడ్స్‌ వంటివి తీసుకోవడం వల్ల కూడా అవాంఛిత రోమాలు వస్తుంటాయి. టాపికల్‌ మినాక్సిడల్‌ ద్రావణం ఎక్కువగా వాడినా ఈ సమస్యకు కారణమవుతుంది. వీటినీ సరి  చూసుకోండి. లేజర్‌ మంచి నిర్ణయమే. దీనికి 6-8 సిట్టింగులు కావాలి. అయితే దీంతో 80% వరకే తొలగించగలం. పెదవిపై వాటికి లేజర్‌ సరిపోతుంది. కానీ గడ్డంపై రోమాలకు లేజర్‌తోపాటు ఎలక్ట్రాలిసిస్‌ కూడా చేయించుకోండి. అప్పుడు వంద శాతం సమస్య తీరుతుంది. సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండదు. అయితే ఎలక్ట్రాలిసిస్‌కి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఓపికగా చేయించుకోవాలి. లేజర్‌తో పోలిస్తే దీనికి ఇంకా ఎక్కువ సిట్టింగులే కావాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్