సబ్బు కాకుండా.. ఇంకేంటి?

సబ్బు రాస్తే ఒళ్లంతా పగిలినట్లు అవుతోంది. ఈకాలం మరింత ఇబ్బందిగా ఉంది. చర్మం నునుపుగా ఉండాలంటే వేరే ప్రత్యామ్నాయాలున్నాయా?

Updated : 19 Nov 2023 05:12 IST

సబ్బు రాస్తే ఒళ్లంతా పగిలినట్లు అవుతోంది. ఈకాలం మరింత ఇబ్బందిగా ఉంది. చర్మం నునుపుగా ఉండాలంటే వేరే ప్రత్యామ్నాయాలున్నాయా?

- ఓ సోదరి

పొడిచర్మం వారికి ఈ సమస్య తప్పదు. ఈ చలికి తేమ తగ్గి, పొట్టులా రాలడం, దురద వంటివి కలుగుతాయి. వేడి నీటి స్నానాలు, ఒంటిని గరుకు వాటితో తోమడం, రసాయనాలున్న సబ్బులు వాడటం, స్క్రబింగ్‌ వంటివి చేస్తే సమస్య మరింత పెరుగుతుంది. నలభై దాటినవాళ్లలో చర్మంలో సహజనూనెలు తగ్గుతాయి. ఉద్యోగస్థులైతే ఎక్కువసేపు ఏసీలో ఉన్నా హైపో థైరాయిడిజం ఉన్నా, సరైన పోషకాలు తీసుకోకపోయినా, నీరు ఎక్కువగా తాగకపోయినా కూడా ఇలా జరుగుతుంది. ముఖంపై ముడతలు, అరికాళ్లు, చేతుల్లో పగుళ్లు వంటివీ కనిపిస్తాయి. డిటర్జెంట్లు, సబ్బులు, శానిటైజర్లకు దూరంగా ఉండండి. స్నానానికి సబ్బులకు బదులుగా నాన్‌ సోప్‌ క్లెన్సింగ్‌ క్రీములు, షవర్‌ జెల్‌లు, ముఖానికి ఫేస్‌వాష్‌లు ఉపయోగించొచ్చు. గోరువెచ్చని నీటితో అదీ చాలా తక్కువ సమయంలో స్నానం ముగించండి. స్నానమయ్యాక ఒళ్లు కాస్త తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్‌ రాయాలి. తరచూ చేతులు, కాళ్లు కడగొద్దు. వీలున్నంత వరకూ చర్మమంతా కప్పే దుస్తులను వేసుకోండి. బయటి ఆహారం తీసుకోవద్దు. దాహం వేసినా వేయకపోయినా కనీసం 3 లీటర్ల నీటిని తీసుకోవాలి. స్నానానికి ముందు ఆలివ్‌ నూనెని ఒంటికి రాసుకోండి. తేమను అందివ్వడమే కాదు చర్మాన్ని రిపేర్‌ కూడా చేస్తుంది. దురద వంటివి ఉంటే కలబంద రాయొచ్చు. లేదా పెరుగులో తేనె, పసుపు కలిపి పట్టించి పావుగంటయ్యాక కడిగేయొచ్చు. నిద్రపోయే ముందు కొబ్బరినూనె లేదా వైట్‌ పెట్రోలియం జెల్లీ రాసినా మంచిదే. లాక్టిక్‌ యాసిడ్‌, సెరమైడ్స్‌ ఉన్న మాయిశ్చరైజర్లనే వాడండి. టీ, కాఫీలను తగ్గించాలి. ఆల్కహాల్‌, యాపిల్‌ సిడార్‌ ఉన్న ఉత్పత్తులకూ దూరంగా ఉండండి. ఈ జాగ్రత్తలనీ పాటిస్తే పొడిబారే సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్