అమ్మాయిలూ.. బాగా తినాలి!

అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు అమ్మాయిలు. కానీ బరువు పెరుగుతామనో, నిర్లక్ష్యమో తెలియదు కానీ...

Published : 16 May 2021 00:41 IST

అబ్బాయిలతో సమానంగా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు అమ్మాయిలు. కానీ బరువు పెరుగుతామనో, నిర్లక్ష్యమో తెలియదు కానీ... పోషకాహారం విషయంలో మాత్రం వారికంటే వెనకే ఉంటున్నారంటారు వైద్యులు. అందుకోసమే ఈ సూచనలు.
* ఉదయం లేచిన అరగంట లోపే ఏదో ఒకటి తినాలి. రెండు ఖర్జూరాలు, గుప్పెడు నానబెట్టిన బాదం గింజలు, ఓ గుడ్డు తింటే చాలు... అల్పాహారం అక్కర్లేదు. లేదంటే గ్లాసు పాలు, బాదం గింజలూ, రెండు ఇడ్లీలు... తీసుకుంటే రోజంతా చురుగ్గా పనిచేసుకోగలరు.
* అల్పాహారానికీ, భోజనానికీ మధ్య ఆకలేస్తే ఓ గ్లాసు పళ్ల రసం తాగండి. మధ్యాహ్న భోజనంలో బఠానీలూ, బీన్స్‌, రాజ్మా, సెనగలు, ఆకుకూరలు, కాయగూరలు, పప్పు, పెరుగు వంటివి ఉండేలా చూసుకోండి. వీటిల్లో ఐరన్‌, జింక్‌, క్యాల్షియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్లూ పుష్కలంగా దొరుకుతాయి. ఆహార ప్రణాళిక వేసుకోవడం వల్ల అన్ని పోషకాలూ శరీరానికి అందుతాయి. ఎప్పుడైనా భోజనం చేసే తీరిక లేకపోతే... నాలుగైదు నానబెట్టిన బాదం గింజలు, పండ్లముక్కలు, ఓ చిక్కీ తినండి. కడుపు నింపుతాయి...అవసరమైన శక్తినీ ఇస్తాయి.
* రాత్రిళ్లు తేలిగ్గా ఉండే ఆహారం తీసుకోండి. చపాతీ, కప్పు అన్నం, కూర వంటివి చాలు. మసాలాలు, మాంసాహారం వంటివి ఈ వేళలో సాధ్యమైనంత తక్కువ తినండి. పడుకునే ముందు గ్లాసు పాలు తాగగలిగితే... శరీరానికి తగినంతగా క్యాల్షియం అందుతుంది. మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్