వేసవిలో చల్లగా..

వేసవిలో ముఖం నల్లగా మారి, పొడిబారుతుంది. జిడ్డు చర్మంగలవారికి ముఖం జిడ్డుగా మారి ఇబ్బంది పెడుతుంది. దీనికి ఐస్‌తో చెక్‌ పెట్టవచ్చు. అలానే ఐస్‌తో మరిన్ని ప్రయోజనాలున్నాయ్‌...

Updated : 20 May 2021 07:18 IST

వేసవిలో ముఖం నల్లగా మారి, పొడిబారుతుంది. జిడ్డు చర్మంగలవారికి ముఖం జిడ్డుగా మారి ఇబ్బంది పెడుతుంది. దీనికి ఐస్‌తో చెక్‌ పెట్టవచ్చు. అలానే ఐస్‌తో మరిన్ని ప్రయోజనాలున్నాయ్‌...
కళ్లు బాగా అలసిపోయినప్పుడు వాటి చుట్టూ నలుపు కనిపిస్తుంది. నిర్జీవంగా కూడా కనపడతాయి. అప్పుడు ఐస్‌ప్యాక్‌తో కళ్ల చుట్టూ మసాజ్‌ చేయండి. వాపు తగ్గి ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
*ఎండలో తిరిగినప్పుడు చర్మ సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు ఒక కాటన్‌ వస్త్రంలో ఐస్‌ క్యూబ్స్‌ చుట్టి నెమ్మదిగా రుద్దితే ముఖం తేటగా అవుతుంది.  
* ముఖం మీద ఐస్‌క్యూబ్స్‌తో రుద్దడం వల్ల ముఖం మీద ఉన్న రంధ్రాలు తగ్గుతాయి. దీంతో జిడ్డు చర్మంగల వారికి చమురు కారడం నియంత్రణలోకి వస్తుంది.  
* కొద్దిగా రోజ్‌వాటర్‌లో దోస రసాన్ని కలిపి ఐస్‌ ట్రేలో వేసి ఫ్రీజర్‌లో ఉంచండి. ఈ క్యూబ్‌తో ముఖం మీద రుద్దుకోవాలి. క్రమం తప్పక ఇలా చేస్తూ ఉంటే మొటిమలు, మచ్చలూ తొలిగిపోతాయి.
* ముఖం మీద ఫౌండేషన్‌ రాసుకునేటప్పుడు ముందుగా ఐస్‌ ప్యాక్‌ వేసుకోండి. ఆ తర్వాత రాస్తే ముఖానికి అతుక్కుని ఎక్కువసేపు ఉంటుంది. అలాగే పొడిబారిన పెదవులమీద ఐస్‌తో రుద్దితే మృదువుగా మారతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్