బుజ్జాయిలకూ ఓ డిజైనర్‌!

బుజ్జిబుజ్జి చేతులకు మురుగులు వేసి ముచ్చట తీర్చుకోవాలని ఏ తల్లికైనా ఉంటుంది కదా! చిట్టిచెవులకు పెట్టే పోగుల్ని మళ్లీమళ్లీ చూడాలనిపిస్తుంది. వీటితోపాటు మరిన్ని విభిన్నమైన నగలు తయారుచేస్తూ

Published : 25 May 2021 01:05 IST

బుజ్జిబుజ్జి చేతులకు మురుగులు వేసి ముచ్చట తీర్చుకోవాలని ఏ తల్లికైనా ఉంటుంది కదా! చిట్టిచెవులకు పెట్టే పోగుల్ని మళ్లీమళ్లీ చూడాలనిపిస్తుంది. వీటితోపాటు మరిన్ని విభిన్నమైన నగలు తయారుచేస్తూ బేబీ జ్యుయలరీలో తనదైన ముద్ర వేస్తోంది రాజసీ జిందాల్‌. మూడేళ్ల క్రితం ఆమె మొదలుపెట్టిన రాజసీ జిందాల్‌ బ్రాండ్‌ ఎంతో మంది సెలబ్రిటీల మనసు దోచుకుంది. ‘పదునైన అంచుల్లేకుండా, తేలికగా, పిల్లలు పాకినప్పుడు, పడుకొన్నప్పుడు అసౌకర్యంగా లేకుండా చేయడం కోసం చాలా ప్రయోగాలు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా మన సంప్రదాయాన్ని తెలిపే దిష్టిపూసల్లాంటి వాటిని జోడించి ఆధునికతని అద్దడం కాస్త కష్టమైంది. పిల్లలకు కొన్ని లోహాలు హైపో అలర్జిక్‌ సమస్యల్ని కలిగించవచ్చు. వీటన్నింటినీ సరిచేసుకుంటూ దీన్నో బ్రాండ్‌గా తీసుకొచ్చా’ అంటోంది రాజసి. చూడ్డానికి ఎంతో ముద్దుగా ఉండే ఈ నగల్ని శిల్పాశెట్టి వంటివారు తమ పిల్లలకోసం ముచ్చటపడి కొనుక్కుంటున్నారట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్