పాల దంతాలపై శ్రద్ధ తీసుకుంటున్నారా?

పిల్లల దంతాల విషయం పట్టించుకోకపోతే తర్వాత ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.. అందుకే ముందుగానే శ్రద్ధ చూపించాలి.

Updated : 28 May 2021 00:56 IST

పిల్లల దంతాల విషయం పట్టించుకోకపోతే తర్వాత ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.. అందుకే ముందుగానే శ్రద్ధ చూపించాలి.
రోజూ రెండు పూటలా బ్రష్‌ చేయించాలి. లేకపోతే పళ్లలో క్రిముల వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే అల్పాహారానికి ముందు, భోజనం తర్వాత తప్పనిసరిగా బ్రష్‌ చేయించండి.
* బ్రష్‌ చేయడం అయ్యాక మర్చిపోకుండా నాలుకనూ శుభ్రం చేయించండి. నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా నాలుక పైభాగాన ఉంటుందని మర్చిపోవద్దు.
* అన్నం తిన్న తర్వాత పిల్లలను నోరు పుక్కిలించమనాలి. ఏవైనా ఆహార పదార్థాలు నోటిలో ఉండిపోతే తొలగిపోతాయి. ఇంకా పళ్ల మధ్య ఇరుక్కుపోయి రాకపోతే బబుల్‌గమ్‌ ఇచ్చి నమలమనండి. పిల్లలు ఇష్టంగానే నములుతారు కాబట్టి పళ్లలో మిగిలిన పదార్థాలు సులువుగా వచ్చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్