నా భర్తకు ముందే పెళ్లయ్యింది

మీ పెళ్లికి ముందే అతడు మరో అమ్మాయిని రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు అంటున్నారు. అలా జరిగిన పెళ్లి చట్టప్రకారం చెల్లుతుంది. హిందూ వివాహచట్టంలోని సెక్షన్‌ ఐదు ప్రకారం వివాహ నిబంధనలలో మొదటిది... పెళ్లి జరిగే సమయానికి అతడు/ఆమె వివాహితులు కాకూడదు.

Updated : 30 May 2021 11:03 IST

నాకు పెళ్లయ్యి మూడేళ్లయ్యింది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే ఈ మధ్య మా వారు చదువుకునేటప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించి రిజిస్టర్‌ వివాహం చేసుకున్నారని తెలిసింది. ఆ అమ్మాయి వచ్చి తనకూ ఇప్పుడే నన్ను మరో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందని, మా పెళ్లి చెల్లదని గొడవపడింది. ఇదంతా చూస్తుంటే భయమేస్తోంది. నాకు న్యాయం జరిగేదెలా?

  - ఓ సోదరి

మీ పెళ్లికి ముందే అతడు మరో అమ్మాయిని రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు అంటున్నారు. అలా జరిగిన పెళ్లి చట్టప్రకారం చెల్లుతుంది. హిందూ వివాహచట్టంలోని సెక్షన్‌ ఐదు ప్రకారం వివాహ నిబంధనలలో మొదటిది... పెళ్లి జరిగే సమయానికి అతడు/ఆమె వివాహితులు కాకూడదు. ఒకవేళ అయినా అప్పటికే విడాకులు తీసుకుని ఉండాలి. అలాకాకుండా మరో పెళ్లి చేసుకుంటే సెక్షన్‌ 11 ప్రకారం దాన్ని చట్టం గుర్తించదు. ముందు మీరు అతని ద్వారా ఎలాంటి హక్కులు కావాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. మీరిద్దరూ కలిసి జీవిస్తున్నారు కాబట్టి పుట్టబోయే పిల్లలకు కూడా తండ్రి ఆస్తిలో వాటా అతడి తదనంతరం దక్కుతుంది. మీరు మెయింటెనెన్స్‌కు, భరణానికి అర్హులవుతారు. మీకు అతని జీతంలో  లేదా ఆస్తిలో భాగం కావాలనుకుంటే కోర్టు ద్వారా మెయింటెనెన్స్‌ ఆర్డర్‌ పొందవచ్చు. అతడు మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నా... మీ పెళ్లి చట్టబద్ధం కాదు. అందుకు రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుని చెల్లుబాటు చేసుకుంటే మంచిది. కాబట్టి అతను విడాకులు తీసుకుని మీ బంధాన్ని చట్టబద్ధం చేసుకోవాల్సిందే. ఏదైనా అతడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్