ఆ స్నేహాన్ని నమ్మొద్దు..

ప్రాణస్నేహితులు అనుకుంటే వాళ్లను నమ్మి అన్ని విషయాలూ పంచుకుంటాం. తీరా మనతో స్నేహం చెడి వాళ్లు ఆ విషయాలని అందరికీ చెప్పేస్తే? అందుకే ఎంత దగ్గరివారు అనుకున్నా కొన్ని పరిమితులు తప్పనిసరి... 

Published : 02 Aug 2023 00:01 IST

ప్రాణస్నేహితులు అనుకుంటే వాళ్లను నమ్మి అన్ని విషయాలూ పంచుకుంటాం. తీరా మనతో స్నేహం చెడి వాళ్లు ఆ విషయాలని అందరికీ చెప్పేస్తే? అందుకే ఎంత దగ్గరివారు అనుకున్నా కొన్ని పరిమితులు తప్పనిసరి... 

న అభిప్రాయాలు, ఆలోచనలను గౌరవించి ప్రోత్సహిస్తూనే, హద్దులకూ విలువనిచ్చేవారు మాత్రమే నిజమైన స్నేహితులు. వాళ్లే మనం ముందడుగు వేయడానికి వారి వంతు చేయూతనివ్వడానికి నిత్యం సిద్ధంగా ఉంటారు.

హాస్యంగా..

ఇతరులను నవ్వించడానికి స్నేహితులు అని కూడా చూడకుండా అవమానించడానికి వెనుకాడని వ్యక్తులను స్నేహితులుగా భావించకూడదు. ఎదుటివారి ముందు తేలిక చేయడం, మన రహస్యాలను కూడా అవతలివారికి హేళనగా మార్చి చెప్పేవారిని నమ్మకపోవడం మంచిది. మనం ఎదగాలని ఆలోచన చెప్పినప్పుడు మధ్యలోనే తుంచేయడానికి ప్రయత్నించేవారితో ఏదీ పంచుకోకుండా ఉండటం ఉత్తమం.

ఆలోచించి..

ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడు తోడు ఒకరున్నారనే భావన మనసుకు కలిగితే ఆ వ్యక్తితో మన బాధలను పంచుకోవాలనిపించడం మంచిదే. అయితే అవతలివారి వ్యక్తిత్వాన్ని గుర్తించడం అంతకన్నా ముఖ్యం. లేదంటే మన బాధతోపాటు ఇతరుల నుంచి వచ్చే హేళనలనూ భరించాల్సి ఉంటుంది. అందుకే స్నేహితులను ఎంచుకొనేటప్పుడు ఆలోచించి అడుగువేయడం, అవతలివారి ప్రవర్తనను గుర్తించే ప్రయత్నం చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్