ముగ్గురిలో ఆమె!

సాధారణంగా ఫోర్బ్స్‌ ముఖచిత్రంగా వ్యాపారవేత్తలే కనిపిస్తుంటారు. సినీతారలు తక్కువనే చెప్పాలి. కానీ ఈ సారి దక్షిణాది నటి నయనతార కనిపించడం విశేషం. ఆమెని ఫోర్బ్స్‌ ఎందుకు ఎంపిక చేసిందో తెలుసుకోవాలని ఉందా? అయితే చదివేయండి... కొవిడ్‌ కారణంగా థియేటర్లనీ మూతబడ్డాయి. మన దేశంలో సినిమానే ప్రధాన ఎంటర్‌టైన్‌మెంట్‌. ఆ సమయంలో ప్రేక్షకులను అలరించడానికి ముందుకొచ్చినవే ఓటీటీలు.

Updated : 30 Aug 2022 15:47 IST

సాధారణంగా ఫోర్బ్స్‌ ముఖచిత్రంగా వ్యాపారవేత్తలే కనిపిస్తుంటారు. సినీతారలు తక్కువనే చెప్పాలి. కానీ ఈ సారి దక్షిణాది నటి నయనతార కనిపించడం విశేషం. ఆమెని ఫోర్బ్స్‌ ఎందుకు ఎంపిక చేసిందో తెలుసుకోవాలని ఉందా? అయితే చదివేయండి...

కొవిడ్‌ కారణంగా థియేటర్లనీ మూతబడ్డాయి. మన దేశంలో సినిమానే ప్రధాన ఎంటర్‌టైన్‌మెంట్‌. ఆ సమయంలో ప్రేక్షకులను అలరించడానికి ముందుకొచ్చినవే ఓటీటీలు. ప్రాంతీయ భాషల్లో వచ్చేసరికి ఆదరణా పెరిగింది. ఈ అవకాశాన్ని అందరికంటే ముందు నయన తార అందిపుచ్చుకోవడమే కాక తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో దూసుకుపోతోంది. అందుకే ఫోర్బ్స్‌ ఈమెను ఎంపిక చేసింది. నిజానికి నయన్‌కి ఇది కొత్తేమీ కాదు. 2018లోనే ఇండియన్‌ సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకుంది. దక్షిణాది చిత్రాలనుంచి ఆ అవకాశం దక్కించుకున్నది నయన్‌ మాత్రమే. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరుచుకుంటూ సాగే తన తీరే ఇన్నేళ్లుగా అవకాశాలను తెచ్చిపెడుతోందంటారు నిపుణులు. లేడీ సూపర్‌స్టార్‌ టైటిల్‌కూ కారణమైందంటారు. బాలీవుడ్‌ సహా పెద్ద సినిమాలన్నీ థియేటర్ల కోసం వేచి చూస్తోంటే కొందరు మాత్రం ఓటీటీ అవకాశాన్ని వినియోగించుకుని ముందుకు సాగుతున్నారు. అదే ఈసారి ఫోర్బ్స్‌ దక్షిణాది చిత్రాలపై దృష్టి పెట్టడానికి కారణమైంది. వీళ్లలో ముగుర్ని ఎంపిక చేయగా.. నయన్‌ ముందంజలో ఉంది. అంతేకాదు.. నిర్మాణం, ఇతర వ్యాపారాలపైనా దృష్టిపెట్టింది. తనతోపాటు దుల్కర్‌ సల్మాన్‌, యష్‌లనూ ఫోర్బ్స్‌ ఎంపిక చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్