కణుపుల వరకూ కత్తిరిస్తే..

పూల మొక్కల పెంపకం అంటే చాలామందికి ఆసక్తి. కుండీల్లోనో, నేలమీదో వాటిని నాటుతారు కానీ, అనుకున్నట్లుగా విరులను మాత్రం పూయించలేరు. ఇందుకు బోలెడు కారణాలు.

Published : 04 Aug 2023 00:02 IST

పూల మొక్కల పెంపకం అంటే చాలామందికి ఆసక్తి. కుండీల్లోనో, నేలమీదో వాటిని నాటుతారు కానీ, అనుకున్నట్లుగా విరులను మాత్రం పూయించలేరు. ఇందుకు బోలెడు కారణాలు. వాటిని తెలుసుకుంటే.... మీ తోటను వర్ణరంజితంగా మార్చేయొచ్చు.

  • పెంచాలనుకున్న మొక్కలు ఏడాదంతా పూసేవా, సీజన్‌లో మాత్రమే విరబూస్తాయా అన్న విషయం ముందు తెలుసుకోండి. లేదంటే పచ్చగానే పెరుగుతున్నా మొగ్గతొడగదు.
  • మీరు మొక్కల్ని పెట్టే చోట వాతావరణం ఎలా ఉంటుందో గమనించారా? ఎందుకంటే... పూల రకాలకు తగినంత ఎండ కావాలి. ఎక్కడ వాటిని ఉంచినా కనీసం మూడు నాలుగు గంటల పాటు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. అప్పుడు నిండుగా పూస్తాయి.
  • మనిషికి శరీర క్రియలు బాగుండాలంటే పోషకాహారం ఎంత అవసరమో.. మొక్క ఆరోగ్యంగా ఎదుగుతూ చక్కగా పూలు పూయాలంటే పోషకాలు క్రమం తప్పకుండా ఇవ్వాలి. మరీ ముఖ్యంగా ప్రతి పదిహేను రోజులకోసారి పొటాషియం శాతం ఎక్కువగా ఉండే ఎన్‌పీకే ఎరువుని అందించాలి. ద్రవ రూపంలో ఉన్నదైతే మరీ మంచిది. వర్మీ కంపోస్ట్‌, అరటి తొక్కలు, కోడిగుడ్డు పెంకులూ, ఉల్లి, బియ్యం కడుగు వంటివన్నీ ఇవ్వొచ్చు. అయితే, మొక్కలో పీహెచ్‌ బ్యాలెన్స్‌ తగ్గిపోకుండా స్పటిక నీళ్లు, నిమ్మరసం వంటివి నెలకోసారైనా మట్టిలో పోస్తే సరి. 
  • ఇవన్నీ అందించాం కదా...మన పని అయిపోయింది అనుకోవద్దు. వాడిపోయిన ఆకులూ, పువ్వులూ, పురుగు పట్టిన కొమ్మల్ని ఎప్పటికప్పుడు తీసేయాలి. కొత్త కొమ్మలూ, చిగుళ్లూ, మొగ్గలకోసం కణుపుల వరకూ ప్రూనింగ్‌ చేసుకోవాలి. అప్పుడే మొక్క గుబురుగా పెరుగుతుంది.
  • మగ్గు నీళ్లల్లో పావు చెంచా వేపనూనె, బేకింగ్‌ సోడా కలిపి దానిపై స్ప్రే చేస్తే చీడపీడలుండవు. చీమలు పడితే దాల్చిన చెక్కపొడి చల్లండి. తెల్లదోమకు సర్ఫ్‌ నీళ్లు చల్లితే చాలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్