నెలసరి ముందుగానే వచ్చేస్తోంది!

నా వయసు 42. నాలుగు నెలల నుంచి నెలసరి అయిదారు రోజుల ముందే వచ్చేస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇంతకు ముందు

Published : 09 Jul 2021 00:35 IST

నా వయసు 42. నాలుగు నెలల నుంచి నెలసరి అయిదారు రోజుల ముందే వచ్చేస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇంతకు ముందు ఒకే తేదీకే వచ్చేది. ఇదేమైనా అనారోగ్య సంకేతమా?

- ఓ సోదరి

సాధారణంగా నలభై ఏళ్లు దాటిన తరువాత శరీరంలో హార్మోన్ల స్థాయిల్లో మార్పు వస్తుంది. అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లలో ముందుగా ప్రొజెస్టిరాన్‌ తగ్గిపోతుంది. నెలసరి ఎన్ని రోజులకు రావాలనేది ప్రొజెస్టిరాన్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది తగ్గడంతో రుతుచక్రం ముందుగానే వచ్చేస్తుంది. నెలసరి 21 నుంచి 30 వరకు ఎప్పుడు వచ్చినా కంగారు పడక్కర్లేేదు. అయితే 21 రోజుల కంటే ముందుగానే వచ్చేస్తున్నా లేదా రక్తస్రావం ఎక్కువగా అవుతున్నా తప్పక వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. హార్మోన్ల సమస్య ఐతే ప్రొజెస్టిరాన్‌ సప్లిమెంట్స్‌, నెలసరి రెండో భాగంలో పదిరోజుల నుంచి రెండు వారాలు వాడితే నెలసరి సాధారణ స్థితికి వచ్చేస్తుంది. కాబట్టి కంగారు పడకుండా ముందుగా గైనకాలజిస్ట్‌ను కలవండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్