ఆ విశ్వాసం..ఇప్పుడు లేదు

ఆరేళ్ల ఉద్యోగ విరామం తర్వాత తిరిగి ప్రయత్నాలు మొదలుపెట్టా. ఓ పెద్ద సంస్థలో నాలుగేళ్లపాటు పనిచేశా. నా పనితో పైవాళ్లనీ మెప్పించా. కానీ.. కుటుంబ కారణాల వల్ల కొలువు పక్కన పెటాల్సి వచ్చింది. కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నా కానీ.. ఆత్మవిశ్వాసం తగ్గింది.

Published : 03 Feb 2022 01:31 IST

ఆరేళ్ల ఉద్యోగ విరామం తర్వాత తిరిగి ప్రయత్నాలు మొదలుపెట్టా. ఓ పెద్ద సంస్థలో నాలుగేళ్లపాటు పనిచేశా. నా పనితో పైవాళ్లనీ మెప్పించా. కానీ.. కుటుంబ కారణాల వల్ల కొలువు పక్కన పెటాల్సి వచ్చింది. కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నా కానీ.. ఆత్మవిశ్వాసం తగ్గింది. నాపై నేనే నమ్మకం కోల్పోయా. దీన్ని అధిగమించేదెలా?

- స్వప్న, హైదరాబాద్‌

ఉద్యోగ ప్రపంచానికి తిరిగి రావాలనుకున్నందుకు అభినందనలు. మీ భావనలను తెలుసుకోవడం, వాటికి సమాధానాలను కనుక్కోవాలని ప్రయత్నించడం మంచి నిర్ణయం. కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటపడాలనుకున్నప్పుడు ఇలాంటి భావనలు సహజమే. అయితే వాటిని గుర్తించడం, సరిగా పునర్నిర్మించుకోవడం ప్రధానం.
* ‘నన్నెందుకు ఎంచుకుంటారు?’ అనుకుంటే.. మీ వల్ల సంస్థకు ఏ ప్రయోజనం లేదు అనుకున్నట్లే. దరఖాస్తుకు ముందే నేను చేయగలను. ఆ హోదాకు న్యాయం చేకూర్చగలను అని నమ్మండి.
* ‘కొత్త ఉద్యోగానికి నా దగ్గర సమయం లేదు’ అనిపిస్తే.. 24 గంటలూ వెతికే ప్రయత్నంలోనే ఉండాల్సిన పనిలేదు. వారానికి 2-3 గంటలు కేటాయించుకోండి. సులువైన, తేలికైన మార్గాల కోసం వెతకండి.
* ‘నాకెవరూ తెలీదు’.. పెద్ద పరిచయాలు, నెట్‌వర్క్‌ లేనంత మాత్రాన మంచి హోదా దొరకదని కాదు. పరిచయాలను పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడెన్నో వృత్తిగత సామాజిక మాధ్యమాలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వారితో పరిచయం, మార్గనిర్దేశం.. ప్రస్తుత పరిస్థితిపై అవగాహననూ కల్పిస్తుంది.
* ‘నా అభిరుచేంటో తెలీట్లేదు’.. అయినా కెరియర్‌లో విజయం సాధ్యమే. సరైన అవగాహన లేదనిపిస్తే.. అనుభవం, పరిజ్ఞానం, నైపుణ్యం ఆధారంగా నిర్ణయం తీసుకుంటే సరి.
మనసు కోతి.. అన్న సామెత విన్నారా? అది ఎన్నో ఆలోచనలు మీ ముందు పెడుతుంది. దానిలో పనికొచ్చేవాటిని గుర్తించండి. ప్రతికూలతలను పెంచే వాటినీ.. అనుకూలంగా ఆలోచించడం మొదలుపెట్టండి. సరైన దారి తప్పక దొరుకుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్