నెలసరి సమస్యలకు స్వస్తి

కొందరు స్త్రీలకు నెలసరి పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. ఆ మూడు రోజులూ చాలా అలసటగా, అసహనంగా, చిరాగ్గా ఉంటుంది. ఇంకొందరికి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. కొందరు అధిక రక్తస్రావంతో బాధ పడుతుంటారు.

Published : 09 Apr 2022 01:49 IST

కొందరు స్త్రీలకు నెలసరి పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. ఆ మూడు రోజులూ చాలా అలసటగా, అసహనంగా, చిరాగ్గా ఉంటుంది. ఇంకొందరికి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. కొందరు అధిక రక్తస్రావంతో బాధ పడుతుంటారు. వీటి నుంచి బయటపడటానికి యోగాలో మహా స్వాదిష్టాన ముద్ర ప్రయత్నించండి. ఇది చాలా సులువు కూడా.

ముందుగా పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ నిటారుగా కూర్చోవాలి. రెండు ఉంగరం వేళ్ల చివరి భాగాలనూ బొటన వేళ్ల అంచులకు కలిపి రెండు చేతులనూ దగ్గరగా ఉంచాలి. తర్వాత చిటికెన వేళ్లను కలిపి ఉంచాలి. ఈ భంగిమలో కూర్చుని 10, 12 సార్లు మెల్లగా శ్వాస తీసుకుని మెల్లగా వదలాలి. ఇదే మహా స్వాదిష్టాన ముద్ర. త్రిసంధ్యలు అంటారు కదా.. అలా మూడుసార్లు కనుక ఈ ముద్రలో కూర్చుంటే పొట్ట కింద బొడ్డు వద్ద ఎలాంటి ఇబ్బందులున్నా ఉపశమిస్తాయి. నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి, అధిక రక్తస్రావం లాంటి సమస్యలు తగ్గుతాయి. ఆ సమయంలో ఇతర ముద్రలు సాధారణంగా చేయ కూడదు. కానీ ఈ ముద్ర చేయొచ్చు. అలాగే అజీర్తి ఉన్నవాళ్లకు, మూత్రాశయ సమస్యలు ఉన్న వారికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజుకు మూడు సార్లు ఐదు నిమిషాల చొప్పున చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని