తెల్లజుట్టు.. నల్లబడాలంటే!

జుట్టు కుదుళ్లలో మెలనిన్‌ ఉత్పత్తి తగ్గిపోతే వెంట్రుకలు తెలుపు రంగులోకి మారతాయి. కొందరిలో ఇది మరీ త్వరగా మొదలవుతుంది. వంశపారంపర్యం, పోషకాహార లోపం, ఒత్తిడి, బి12, సి, ఇ విటమిన్లు, జింక్, కాపర్‌ వంటివి తగ్గడం, జంక్‌ ఫుడ్‌ ఎక్కువ

Updated : 15 May 2022 06:34 IST

నా వయసు 21. రెండేళ్ల క్రితం నుంచే జుట్టు తెల్లబడటం మొదలైంది. చాలా చిట్కాలు ప్రయత్నించా, మందులూ వాడా. అందరూ రంగు వేయమంటున్నారు. రసాయనాల భయంతో ఆగా. సహజంగా నల్లబడే మార్గముందా?

- ఓ సోదరి

జుట్టు కుదుళ్లలో మెలనిన్‌ ఉత్పత్తి తగ్గిపోతే వెంట్రుకలు తెలుపు రంగులోకి మారతాయి. కొందరిలో ఇది మరీ త్వరగా మొదలవుతుంది. వంశపారంపర్యం, పోషకాహార లోపం, ఒత్తిడి, బి12, సి, ఇ విటమిన్లు, జింక్, కాపర్‌ వంటివి తగ్గడం, జంక్‌ ఫుడ్‌ ఎక్కువ తీసుకోవడం, హైపర్‌ థైరాయిడిజం, బాగా ఎండలో తిరగడం, పొగ తాగేవారికి దగ్గరగా ఉండటం వంటివి ఇందుకు కారణాలు. కొన్నిసార్లు విటిలిగో, ట్యూబరస్‌ స్క్లెరోసిస్, న్యూరోఫైబ్రమాటాసిస్‌లూ కారణమవొచ్చు. ఆరోగ్యమంతా బాగుంది, అక్కడక్కడా తెల్లవెంట్రుకలే సమస్య అంటే కంగారవసరం లేదు. విటమిన్‌ బి12 ఉండే మాంసం, చేపలు, గుడ్డు, పాలతోపాటు మల్టీవిటమిన్, బి12 ట్యాబ్లెట్లు వాడొచ్చు. ఒత్తిడి తగ్గించుకోండి. ప్రాసెస్డ్‌ ఫుడ్, పంచదార, చాక్లెట్లు, సోడా వంటి వాటికి దూరంగా ఉంటూ విటమిన్‌ ఎ ఉండే ఆకుకూరలు, పసుపు రంగు పండ్లు; విటమిన్‌ బి ఉండే పెరుగు, టమాటా, క్యాలీఫ్లవర్, చిరుధాన్యాలు, అరటి, లివర్, వాల్‌నట్, బాదం, గుమ్మడి గింజలతోపాటు ఐరన్, జింక్, కాపర్‌ ఉండేవి బాగా తీసుకోవాలి.

100 ఎం.ఎల్‌. కొబ్బరి నూనెకు గుప్పెడు కరివేపాకు లేదా రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున ఉసిరి, మెంతిపొడులు కలిపి కాగబెట్టుకోవాలి. దీన్ని తరచూ రాసుకోండి. కప్పు క్యారెట్‌ జ్యూస్‌కి, పావు కప్పు నువ్వుల నూనె, స్పూను మెంతిపొడి రోజు మార్చి రోజు తలకు పట్టించి, కాసేపయ్యాక తలస్నానం చేయాలి. ఇది జుట్టు రంగు మారడంలో సాయపడుతుంది. కప్పు వేడి నీటిలో బ్లాక్‌ టీ పొడి వేసుంచి, చల్లారాక తలకు పట్టించి ఆరాక కడిగేయాలి. పాంటోథోనిక్‌ ఉన్న ఆయిల్స్‌నీ వాడొచ్చు. వాల్‌నట్స్‌ తీసుకోవాలి. మరీ ఎక్కువగా తెల్లబడిందనిపిస్తే బొటానికల్‌ హెయిర్‌ కలర్స్‌ వాడొచ్చు. గోరింటాకు పొడిని టీ డికాక్షన్‌లో కలిపీ పెట్టుకోవచ్చు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్