అంతా బాగుందనుకుంటే.. ఇప్పుడిదీ!

నేనో మేనేజర్‌ని. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ, నన్ను నేను నిరూపించుకుంటూ ఈ స్థాయికి చేరా. బాబు స్కూలుకి వెళుతున్నాడు. ఆఫీసులో నా పనీ సవ్యంగా సాగుతోంది. అంతా బాగుందనుకుంటే విటిలిగో రూపంలో పెద్ద సమస్య

Updated : 22 Jun 2022 05:23 IST

నేనో మేనేజర్‌ని. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ, నన్ను నేను నిరూపించుకుంటూ ఈ స్థాయికి చేరా. బాబు స్కూలుకి వెళుతున్నాడు. ఆఫీసులో నా పనీ సవ్యంగా సాగుతోంది. అంతా బాగుందనుకుంటే విటిలిగో రూపంలో పెద్ద సమస్య వచ్చిపడింది. ముఖ్యంగా ముఖంపై పెద్ద పెద్ద మచ్చలొచ్చాయి. దీంతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నా. ఇతరులతో మాట్లాడేప్పుడు తెలియని ఇబ్బంది. ఎదగడానికి రూపురేఖలు అవసరం లేదని తెలుసు. అయినా నా తీరు దిగజారుతోందే తప్ప మెరుగవట్లేదు. ఏం చేయను?

- నితీష, దిల్లీ

మీ స్థితిని నేను అర్థం చేసుకోగలను. కానీ దీని పరిష్కారం మాత్రం మీకు మీరు ఎలా నచ్చజెప్పుకుంటారన్న దానిలోనే ఉంది. ఇతరులు మిమ్మల్ని జడ్జ్‌ చేయడం, కొన్నిసార్లు కఠినంగా మాట్లాడటం సాధారణమన్న విషయాన్ని ముందు స్వీకరించండి. అయినా ధైర్యం, ఆత్మవిశ్వాసం సడలకుండా చేయగల మార్గాలను ఎంచుకోండి. ఇక్కడ రాధిక గుప్తా గురించి చెప్పుకోవాలి. దేశంలో టాప్‌ సంస్థల్లో ఒకదానికి అతిపిన్న సీఈఓ. మెల్లకన్ను, మెడ సమస్యలు ఇలా ఎత్తిచూపేలా ఎన్ని ఉన్నా ఆవిడ తన బలాలపైనే దృష్టిపెట్టి రాణిస్తోంది. ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. మనల్ని మనం ఎలా చూపిస్తే ఎదుటివారికీ అలాగే కనిపిస్తాం. మీరంటే మీ రూపురేఖలే కాదు. అంతకుమించి! సవాళ్లు ఎదురైనప్పుడు సానుకూలంగా, ఆశావహ దృక్పథంతో ఉండటం సులువు కాదు. అలాగే మన చుట్టూ జరుగుతున్నదాన్ని నివారించడమూ అన్నిసార్లూ సాధ్యం కాదు. కానీ ఇలాంటివి ఎదురైనప్పుడు రెండు విషయాలను మాత్రం గుర్తుంచుకోవాలి. శరీరానికి ఇంధనంగా ఆహారం ఇచ్చినట్లే మనసు దృఢంగా అవ్వడానికీ అవసరమైన ప్రేరణను నిరంతరం అందించాలి. అందరికీ సమస్యలున్నాయి. ఏవీ శాశ్వతం కాదు.. మీ పరిస్థితీ అంతే! వీటిని మననం చేసుకుంటూ మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. పూర్వపు మిమ్మల్ని మీరు చూసుకుంటారు. ఆల్‌ ద బెస్ట్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్