వేళ్లమీద కాయలు.. తగ్గవా?

పాపకి చిన్నప్పుడు నోట్లో వేళ్లు పెట్టుకునే అలవాటుండేది. మానేసి అయిదారేళ్లు అవుతున్నా వేళ్లమీద ఉబ్బుగా.. కాయల్లా ఉండిపోయాయి.

Updated : 09 Jul 2023 01:28 IST

పాపకి చిన్నప్పుడు నోట్లో వేళ్లు పెట్టుకునే అలవాటుండేది. మానేసి అయిదారేళ్లు అవుతున్నా వేళ్లమీద ఉబ్బుగా.. కాయల్లా ఉండిపోయాయి. వాటిని చూసి స్కూల్లో ఏడిపిస్తున్నారట. ఇంటికొచ్చి ఏడుస్తోంది. అవిక తగ్గవంటున్నారు నిజమేనా? మార్గం చూపండి.

- ఓ సోదరి

నోట్లో పెట్టుకోవడం వల్ల అక్కడి చర్మం నిరంతరం రాపిడికి గురవుతుంది. నీటిపొక్కుల్లా వస్తాయి. వాటిని గమనించగానే శుభ్రం చేసి, తడిలేకుండా తుడిచి యాంటీ సెప్టిక్‌ క్రీములు రాయాలి. అవి పగిలి వచ్చే నొప్పికి చాలామంది మానేస్తారు. కొందరు మాత్రం కొనసాగిస్తుంటారు. దీంతో పగిలిన వాటి చర్మం గట్టిగా తయారవుతుంది. ఇంకా కొత్త పొక్కులు వస్తూ కాయల్లా తయారవుతాయి. దీంతో అక్కడి చర్మం మందంగా తయారవుతుంది. ఇవి నిజంగానే త్వరగా పోవు. అందుకే వేళ్లు నోట్లో పెట్టుకోవడం మొదలుపెట్టినప్పుడే మాన్పించే ప్రయత్నాలు ప్రారంభించాలి. లేదంటే వేళ్లను కవర్‌ చేస్తూ కొన్ని ఉత్పత్తులూ వస్తున్నాయి. వాటిని ఉపయోగించాలి. అవైతే నోట్లో పెట్టుకున్నా పిల్లలకు అపాయం ఉండదు. వేళ్లకీ ఈ బొబ్బలు రాకుండా ఉంటాయి. చిన్నతనంలో పెన్నుతో ఎక్కువగా రాసేవాళ్లకీ ఇలా కాయలు కట్టడం గుర్తుందా? ఇప్పుడు చూసుకోండి.. తగ్గిపోయి ఉంటాయి. వీటి పరిస్థితీ అంతే. ఎలాంటి చికిత్సా అవసరం లేదు. కొన్నిరోజులకు అవే తగ్గిపోతాయి. పాపకి ధైర్యం చెప్పండి. ఇంకా వేళ్లకు కాస్త మాయిశ్చరైజర్‌ రాస్తూ ఉండండి. సరిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని