ఎండ తగిలితే సమస్యే!
వయసు 25. పొడిచర్మం. అయిదు నిమిషాలు ఎండ తగిలినా ముఖం మంట పుడుతుంది. చిన్న మొటిమల్లా వచ్చేస్తాయి. త్వరగా తగ్గకపోగా నొప్పి. తర్వాత నల్లమచ్చల్లానూ మారుతున్నాయి.
వయసు 25. పొడిచర్మం. అయిదు నిమిషాలు ఎండ తగిలినా ముఖం మంట పుడుతుంది. చిన్న మొటిమల్లా వచ్చేస్తాయి. త్వరగా తగ్గకపోగా నొప్పి. తర్వాత నల్లమచ్చల్లానూ మారుతున్నాయి. సన్‌స్క్రీన్ లోషన్ వాడుతున్నా సమస్య తగ్గట్లేదు. ఏం చేయను?
- ఓ సోదరి
ఎండ, యూవీ కిరణాలే కాదు.. గాలిలో దుమ్ము, రసాయనాలు వంటివన్నీ చర్మంపై దుష్ప్రభావం చూపేవే! యాక్నేతోపాటు దీర్ఘకాలంలో ఛాయలో మార్పులు, త్వరగా వృద్ధాప్య ఛాయలు, నల్లమచ్చలు వంటివాటికి కారణమవుతాయి. బయటికి వెళ్లిరాగానే ముఖాన్ని శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోండి. సబ్బు కాకుండా పీహెచ్ 5-5.5 ఉన్న ఫేస్‌వాష్‌ను ఎంచుకోండి. మాయిశ్చరైజర్, క్రీమ్ ఆధారిత సీరమ్‌లను తప్పక వాడండి. వాటిలో అలిగో పెప్టెడ్స్, హైలురోనిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్లాంట్ బటర్, నియాసినమైడ్ ఉంటే మంచిది. సన్‌స్క్రీన్ లోషన్ వాడుతున్నా అన్నారు.. ఎస్‌పీఎఫ్ కనీసం 30 ఉన్నదో కాదో చెక్ చేసుకోండి. బయటికి వెళ్లడానికి అరగంట ముందు దీన్ని రాయాలి. సమస్య తీవ్రంగా ఉంటే మాయిశ్చరైజర్ రాశాక పగలు క్లెండమైసిన్, నికోటినమైడ్, నియాసినమైడ్ టాపికల్ క్రీములను రాత్రిపూట రెటినాయిడ్స్ సాల్సిలిక్ యాసిడ్ ఉన్నవీ రాయాలి. ఇంకా మల్టీవిటమిన్ మాస్క్‌ను వారానికి రెండుసార్లు వేయండి. వైద్యుల సలహాతో నియాసినమైడ్, ఎస్‌ఓడీని ఓరల్‌గానూ తీసుకోవాల్సి ఉంటుంది. 2-3 లీటర్ల నీటిని తాగడం, ఎ, సి, డి, బి, బి3 విటమిన్లు ఉన్న ఆహారాన్ని రోజూ తీసుకోవడం తప్పనిసరి. ఎండలోకి వెళ్లేప్పుడు ముఖాన్ని తప్పక కవర్ చేసుకోవాలి. పీరియడ్ సమస్యలు, హార్మోనుల్లో తేడాలు, ఒత్తిడి వగైరానీ చెక్ చేసుకోండి. వీటితో తగ్గకపోతే ఓరల్ యాంటీ బయాటిక్స్, లైట్‌థెరపీ, కెమికల్ పీల్స్ చేయించుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.