మొటిమలు.. మచ్చలు..!

నాది పొడిచర్మం. మొటిమలు ఎక్కువ. నుదురు, గడ్డం మీద విపరీతంగా వస్తున్నాయి. మచ్చలు ఏర్పడుతున్నాయి. తగ్గించుకునే మార్గం చెప్పండి.

Updated : 08 Oct 2023 07:37 IST

నాది పొడిచర్మం. మొటిమలు ఎక్కువ. నుదురు, గడ్డం మీద విపరీతంగా వస్తున్నాయి. మచ్చలు ఏర్పడుతున్నాయి. తగ్గించుకునే మార్గం చెప్పండి.

- ఓ సోదరి

పొడిచర్మం ఉంటే యాక్నే రాదు అనుకుంటారు కానీ.. అది అపోహే! ఇక కొందరు మొటిమలకు ఏవేవో క్రీములు రాస్తుంటారు. దాంతో చర్మం పొడిబారుతుంది. మీది రెండిట్లో ఏ తత్వం? మొదట్నుంచీ పొడిచర్మమే అయితే.. సహజంగా చర్మం తేమను కోరుకుంటుంది. నూనెలు విడుదలయ్యే క్రమంలో చర్మరంధ్రాలు మూసుకుపోయినా.. తేమ అందాలని ఆయిలీ ఉత్పత్తులు వాడుతుంటారు కొందరు. వాటితో ఏర్పడే జిడ్డూ యాక్నేకి దారితీస్తాయి. తక్కువ గాఢత ఉన్న యాక్నే క్లెన్సర్లను వాడండి. బయటకు వెళ్లొచ్చినా ముఖం శుభ్రపరచుకోండి. అలాగని విపరీతంగానూ శుభ్రం చేయొద్దు. రోజులో రెండు మూడుసార్లు సరిపోతుంది. క్లెన్సింగ్‌ పూర్తయ్యాక నాన్‌కమడోజెనిక్‌ మాయిశ్చరైజర్‌ రాయడం తప్పనిసరి. వాటిలో సెరమైడ్స్‌, హైలురోనిక్‌ యాసిడ్‌ ఉండేలా చూసుకోండి. యాక్నే సంబంధించినవీ చర్మతీరును బట్టి ఎంచుకోవాలి. పగలు క్లెండమైసిన్‌, నికోటినమైడ్‌ ఉన్న క్రీములు మీకు సరిపడతాయి. రాత్రి బెంజైల్‌ పెరాక్సైడ్‌ 2.5 మించకుండా ఉన్నది రాయాలి. క్లెన్సర్లలోనూ సాల్సిలిక్‌ యాసిడ్‌, హైలురోనిక్‌ యాసిడ్‌, నియాసినమైడ్‌ ఉన్నవి తీసుకోవాలి. సన్‌స్క్రీన్‌ లోషన్‌ కూడా తప్పనిసరి. టాపికల్‌ క్రీములతో తగ్గకపోతే ఓరల్‌ యాంటీ బయాటిక్స్‌నీ వాడాలి. రెటినాయిక్‌, సాల్సిలిక్‌ యాసిడ్‌ కెమికల్‌ పీల్స్‌నీ చేయించుకోవచ్చు. వీటితో మొటిమలే కాదు మచ్చలూ తగ్గుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్