పదమూడేళ్ల పాప పక్క తడుపుతోంది!

మా అమ్మాయికి 13ఏళ్లు. ఇటీవలే రజస్వల అయింది. నిద్ర పోయిందంటే లేపడం కష్టం. పక్కలో మూత్రం పోసినా తెలియనంత మొద్దు నిద్ర. ఇదేమైనా సమస్యా? ఇలాగే కొనసాగితే తన భవిష్యత్తు ఏమవుతుందో అని భయంగా ఉంది. పరిష్కారం చెప్పండి.

Updated : 20 Nov 2023 02:31 IST

మా అమ్మాయికి 13ఏళ్లు. ఇటీవలే రజస్వల అయింది. నిద్ర పోయిందంటే లేపడం కష్టం. పక్కలో మూత్రం పోసినా తెలియనంత మొద్దు నిద్ర. ఇదేమైనా సమస్యా? ఇలాగే కొనసాగితే తన భవిష్యత్తు ఏమవుతుందో అని భయంగా ఉంది. పరిష్కారం చెప్పండి.

-ఓ సోదరి

మామూలుగా పిల్లలకు 5 ఏళ్లు వచ్చేసరికి పక్క తడిపే సమస్య అదుపులోకి వస్తుంది. అయితే, కొంతమందిలో ఆ వయసు దాటినా ఇది కొనసాగుతుంది. ఈ పరిస్థితిని ప్రైమరీ ఎన్యూరెసిస్‌ అంటారు. మరికొందరిలో మాత్రం ఒకసారి నియంత్రణలోకి వచ్చి...పెద్దయ్యాక మరోసారి మొదలవుతుంది. దీన్ని సెకండరీ ఎన్యూరెసిస్‌ అంటారు. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు కారణంగా జరుగుతుంది. రాత్రిపూట దుస్తులు తడుపుతుంటే దాన్ని నాక్టర్నల్‌ ఎన్యూరెసిస్‌ అనీ, ఉదయం పడుకున్నప్పుడు మూత్రం పోస్తే దాన్ని డే టైం ఎన్యూరెసిస్‌ అనీ అంటారు. మీ అమ్మాయి పరిస్థితికి ఈ రెండింటిలో ఏదో ఒకటి కారణమై ఉండొచ్చు. ఆమెకు ఇలా ఏ వయసు నుంచి వచ్చిందో మీరు చెప్పలేదు. ఏది ఏమైనా ఇది అసాధారణం. ఇటీవలే రజస్వల అయిందంటున్నారు. ఈ పరిస్థితి ఆమెకు నెలసరి సమయాల్లో ఇబ్బంది కలిగిస్తుంది. యూరాలజిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లండి. వాళ్లు బ్లాడర్‌, యూరినరీ ట్రాక్ట్‌లో ఏదైనా ఇన్ఫెక్షన్‌, స్ట్రక్చరల్‌ అబ్‌నార్మాలిటీస్‌ వంటివి ఉంటే తగిన చికిత్స అందిస్తారు. అవేమీ లేకపోతే సైకియాట్రిస్ట్‌ను సంప్రదించండి. వారు మానసిక ఒత్తిడిని తగ్గించే మందులు ఇస్తారు. బిహేవియర్‌ మాడిఫికేషన్‌, బ్లాడర్‌ ట్రైనింగ్‌ ఎక్సర్‌సైజులు చేయిస్తారు. దాంతో సమస్య నెమ్మదిగా అదుపులోకి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్