పాప కోసమే చేసినా...

నా వయసు 28ఏళ్లు. పెళ్లయ్యింది, ఓ పాప. కార్పొరేట్‌ కంపెనీలో ఐదేళ్లు పనిచేశా. పాప ఆలనాపాలనా చూసుకోవటం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశా.  ఇలా ఇంట్లోనే ఉండటం వల్ల నాకు విలువ తగ్గిందనిపిస్తోంది.

Published : 08 Jan 2024 01:42 IST

నా వయసు 28ఏళ్లు. పెళ్లయ్యింది, ఓ పాప. కార్పొరేట్‌ కంపెనీలో ఐదేళ్లు పనిచేశా. పాప ఆలనాపాలనా చూసుకోవటం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశా.  ఇలా ఇంట్లోనే ఉండటం వల్ల నాకు విలువ తగ్గిందనిపిస్తోంది. ఆర్థిక స్వేచ్ఛనూ కోల్పోయా. సమయమంతా ఇంటి పనులకే సరిపోతోంది. తిరిగి ఉద్యోగంలో చేరదామంటే పాపకు నా అవసరం ఉంది.  ఈ ఆలోచనల మధ్య నలిగిపోతున్నా. ఏం చేయాలో సలహా ఇవ్వండి.

- ఓ సోదరి

మీరు మీ పాప కోసం ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. జీవితంలో ముఖ్యమైన బాధ్యతను స్వీకరించారు. స్త్రీకి.. ఉద్యోగం, డబ్బు సంపాదన వంటివన్నీ పిల్లల తర్వాతే అనిపిస్తాయి. నిజానికి ఐదేళ్లలోపు పిల్లలు తెలివితేటలు, మాట్లాడే పద్ధతి, క్రమశిక్షణ, నైతిక విలువలు, కలివిడితనం వంటివన్నీ తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. ఈ దశలో వారి తప్పొప్పులను సరిదిద్దుతూ తీర్చిదిద్దాలి. ఈ విషయంలో మీరు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాంటప్పుడు ఇంట్లో వృథాగా ఉంటున్నామని ఎలా అనుకుంటారు? కొన్నేళ్ల తర్వాత మీ అమ్మాయి జీవితంలో స్థిరపడి, పైకి వచ్చినప్పుడు మీరు ఇప్పుడు పడ్డ శ్రమ విలువ తెలుస్తుంది. ఇంట్లో వాళ్ల దృష్టిలో తక్కువ అయిపోయామని అనుకోకండి.  ఇలాంటివేమీ పట్టించుకోకుండా.. నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నా. డబ్బుకోసమో.. మరొకరి మెప్పు కోసమో కాదు అనుకుంటూ సాగిపోండి. అప్పుడు మీకూ బాధ కలగదు.. పాప స్కూలుకి వెళ్తోంటే మీ అవసరం నెమ్మదిగా తగ్గుతుంది. వృత్తిపరంగా ఎదగడానికి అవసరమైన కోర్సులు నేర్చుకోండి.. వెనకబడ్డామన్న దిగులు ఉండదు. పిల్లల ఎదుగుదల మనసులో ఉంచుకుని, వాళ్లను పెంచడంలో సమయం గడిపితే భవిష్యత్తులో చాలా ఆనందం, సంతృప్తి కలుగుతాయి. ఉద్యోగినిగా ఉంటే ఇది కోల్పోయి ఉండేవారు. ఆ అపరాధభావన తప్పుతోందని గ్రహిస్తే ఈ బాధ ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్