పాదాలకు ప్రత్యేక క్రీం..
చినుకుల కాలం మొదలైంది. ఈ సమయంలో పాదాలను ప్రత్యేకంగా సంరక్షించుకోకపోతే పలు ఇన్ఫెక్షన్లబారిన పడతాయి. వాటి ప్రభావం సుదీర్ఘకాలం బాధించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఏం జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు.
చినుకుల కాలం మొదలైంది. ఈ సమయంలో పాదాలను ప్రత్యేకంగా సంరక్షించుకోకపోతే పలు ఇన్ఫెక్షన్లబారిన పడతాయి. వాటి ప్రభావం సుదీర్ఘకాలం బాధించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఏం జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు.
ఉదయం, రాత్రి నిద్రపోయే ముందు పాదాలను సబ్బుతో మురికి లేకుండా కడగాలి. ముఖ్యంగా వేళ్లమధ్య పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఆ తర్వాత పొడి వస్త్రంతో తడి లేకుండా తుడిచి, మాయిశ్చరైజర్‌తో మృదువుగా మర్దనా చేసి మెత్తని పల్చని సాక్సును ధరించి నిద్రపోవాలి. స్విమ్మింగ్ లేదా జిమ్‌కు వెళ్లినప్పుడు, స్నానాలగది వద్ద ఇతరులు వినియోగించిన పాదరక్షలను వినియోగించకూడదు. ఒకసారి ధరించిన సాక్సును శుభ్రపరచకుండా తిరిగి వినియోగించకూడదు.
ప్రత్యేక క్రీంతో.. పావుకప్పు చొప్పున షియాబటర్, బాదం నూనె, కొబ్బరినూనె, పావుకప్పులో సగం బీ వాక్స్, 50 చుక్కల ఆర్గానిక్ ఆయిల్, 20 చుక్కల చొప్పున పెపర్‌మెంట్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్, లావెండర్ ఆయిల్ సిద్ధం చేసుకోవాలి. ముందుగా బీవాక్స్, బాదంనూనె, కొబ్బరినూనెను ఒక పాత్రలోకి తీసుకొని తక్కువమంటపై మరుగుతున్న నీటిలో ఉంచి డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడిచేయాలి. ఈ మిశ్రమం చిక్కగా అవుతున్నప్పుడు షియాబటర్ వేసి కలుపుతూ, కరిగిన తర్వాత దించేసి చల్లార్చాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో 15 నిమిషాలుంచి తీసేసి, ఇందులో మిగతా నూనెలన్నీ వేసి బ్లెండర్తో 5 నిమిషాలు కలపాలి. ఈ క్రీంను పొడిగా ఉన్న గాజుసీసాలో నింపి ఫ్రిజ్‌లో భద్రపరిస్తే చాలు. రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు ఈ క్రీంతో మృదువుగా మర్దనా చేస్తే ఎటువంటి ఇన్ఫెక్షన్లనూ దరిచేరనివ్వదు. ఇందులోని ఫాటీ యాసిడ్స్ పాదాలను తేమగా, మృదువుగా మారిస్తే, విటమిన్లు ఏ, ఈ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులోని నూనెలు దురద, మంట వంటివాటిని దూరం చేస్తాయి. యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్న ఈ క్రీం అలసిన పాదాలకు ఉపశమనాన్నిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- మొటిమల మచ్చలు తగ్గాలంటే..!
- షాంపూ చేసే ముందు... సహజ చికిత్స
- ఈ అలవాట్లు చర్మ సౌందర్యాన్ని తగ్గిస్తాయ్..!
- Summer Tips: జిడ్డు సమస్యా?
- పడుచుకి... పచ్చటి గుత్తుల హారం!
ఆరోగ్యమస్తు
- కొబ్బరినీళ్లు... ముఖానికి రాస్తే!
- ఫిట్నెస్ డైస్ వేసేద్దాం!
- Couple Exercises: కలిసి చేస్తూ.. బరువు తగ్గేయచ్చు!
- మల్బరీ పండ్లు తింటున్నారా?
- నిద్రలో చెమట పడుతోందా.. అశ్రద్ధ వద్దు!
అనుబంధం
- సంతోషాన్నిచ్చే సబ్బు బుడగలు!
- ఇద్దరి పని వేళలు వేరైనా.. బంధం దృఢమవ్వాలంటే..!
- పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందా?
- యుక్తవయసులో ఆర్థికప్రణాళిక..!
- కప్ప గంతులు వేయించండి!
యూత్ కార్నర్
- అమ్మకి సివిల్స్ బహుమతి!
- అక్కడ గడ్డకట్టుకుపోయా!
- రక్షణ దళంలో... డాక్టరమ్మలు!
- ఆ కోరికలకు కళ్లెం వేయాల్సిందే..!
- Love Brain Disorder: బాయ్‌ఫ్రెండ్‌కు వందసార్లు ఫోన్ చేసింది.. చివరికి ఏమైందంటే?!
'స్వీట్' హోం
- సంపంగి సొగసు చూడతరమా!
- ల్యాప్‌టాప్‌ని ఎలా క్లీన్ చేస్తున్నారు?
- శ్రమను తగ్గిస్తాయివి
- ఈ మామిడి పండ్ల ఖరీదెంతో తెలుసా?
- ఆయన మొండితనాన్ని భరించలేకపోతున్నా...
వర్క్ & లైఫ్
- అందుకే మనం చలిని తట్టుకోలేమట!
- అక్కడ మహిళా ఓటర్లదే హవా!
- Sonam Kapoor: అప్పుడు 32 కిలోలు పెరిగా.. అయినా ఫీలవలేదు!
- విశ్వ సుందరి పోటీలో అరవయ్యేళ్ల అందం..!
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!