గిరిజన మహిళల జీవితాల్లో వెదురు వెలుగులు

అక్కడి మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలనుకుందామె. వెదురు ఉత్పత్తుల తయారీలో వారి నైపుణ్యాలను మెరుగుపరచాలనుకుంది. అందుకే వారి సృజనకు సానపెట్టించింది. ప్రతిఫలంగా ఇప్పుడు వందల మంది గిరిజన స్త్రీలు ఉపాధిÇ పొందుతున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపుకొన్నారు. ఆ విజయం వెనకున్నది ఫల్గుణి జోషి. ఆమె స్ఫూర్తి కథనమిది.

Updated : 30 Sep 2022 14:28 IST

అక్కడి మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలనుకుందామె. వెదురు ఉత్పత్తుల తయారీలో వారి నైపుణ్యాలను మెరుగుపరచాలనుకుంది. అందుకే వారి సృజనకు సానపెట్టించింది. ప్రతిఫలంగా ఇప్పుడు వందల మంది గిరిజన స్త్రీలు ఉపాధిÇ పొందుతున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపుకొన్నారు. ఆ విజయం వెనకున్నది ఫల్గుణి జోషి. ఆమె స్ఫూర్తి కథనమిది.

డిశాలోని నీలగిరి ప్రాంతంలో వెదురు సాగు ఎక్కువ. తరతరాలుగా ఇక్కడి మహిళలు దీంతో రకరకాల ఉత్పత్తులు తయారు చేసి అమ్మి ఉపాధి పొందేవారు. అందులో కాస్తంత నైపుణ్యం, ఆర్థిక చేయూత అందితే, పెద్దస్థాయిలో ఉత్పత్తులను రూపొందించగలరు. ఆ విషయాన్ని గుర్తించింది ఫల్గుణి జోషి. వారిని ప్రోత్సహించి, ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందించాలనుకుంది. వెదురు ఉత్పత్తుల తయారీలో శిక్షణనందించి, గిరిజన స్త్రీల సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంది.

నైపుణ్యానికి మెరుగులు...

రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌కు చెందిన ఫల్గుణి లండన్‌ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో డిప్లొమా చేసింది. నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీలో సైబర్‌ లా అండ్‌ ఫోరెన్సిక్స్‌, సైబర్‌-కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా చేసేటప్పుడు ఫెలోషిప్‌ కోసం ఎస్‌బీఐ యూత్‌ ఫర్‌ ఇండియాలో పనిచేసింది. ఆ సమయంలో గ్రామాభివృద్ధి కోసం ఆయా ప్రాంతాల్లోని స్థానిక సంఘాలతో పనిచేసే అవకాశం దక్కిందీమెకు. అక్కడివారికి స్థానిక సేవాసంస్థలతో కలిసి చేయూతనందించేది. అప్పుడే ఒడిశాలోని గిరిజన మహిళలెదుర్కొంటున్న పలురకాల సమస్యలను చూసింది. వాటికి పరిష్కారం అందించాలంటే వారంతా ఆర్థికపరంగా నిలబడాలి. దానికి వారికున్న వెదురు ఉత్పత్తుల తయారీనే ఆలంబనగా చేయాలని, 2019లో ‘కర్మార్‌ క్రాఫ్ట్స్‌’ ప్రారంభించింది.  ‘మొదట స్థానిక మహిళాసంఘాలన్నింటినీ ఒక్కటిగా చేసి వారందరికీ సమష్టిగా శిక్షణ అందేలా చూశా. వర్క్‌షాపులు నిర్వహించా.

అలా అందరికీ ప్రోత్సాహాన్ని అందించడంతో వెదురు ఉత్పత్తుల తయారీని ప్రారంభించారు. అలా రూపొందించిన వాటిని తామే విక్రయించుకోవడానికి కర్మార్‌ క్రాఫ్ట్స్‌ను వేదికగా చేశా. వారి కళకు ప్రభుత్వ విభాగాలనూ జత చేయగలిగా. దీంతోపాటు అంగన్‌వాడీ కేంద్రాలద్వారా ‘మమతా సాఖీ’ పేరుతో ఒక గ్రూపు రూపొందించి, వీటిద్వారా స్థానిక మహిళలకు ఆరోగ్యంపై అవగాహనా కార్యక్రమాలను చేపడుతున్నా. గర్భిణులు, పాలిచ్చే తల్లులతో వారి ఆరోగ్యం, ఎదుర్కొన్న సమస్యలు, తీసుకుంటున్న ఆహారం వంటి విషయాల గురించి మాట్లాడేలా చేశా. మొదట మా క్రాఫ్ట్స్‌ వేదికపై కేవలం ముగ్గురు మహిళలే ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 300కు పెరిగింది. వీరు తయారుచేసిన ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉంది. ఈ డిజైన్లు, నాణ్యత, ప్రమోషన్‌ వంటి అంశాలన్నీ నేను పరిశీలిస్తుంటా. ఈ క్రాఫ్ట్స్‌ ద్వారా లబ్ధి పొందే మహిళల సంఖ్యను పెంచడానికి ప్రస్తుతం కృషి చేస్తున్నా’ అని చెబుతున్న ఫల్గుణి మహిళా సాధికారత కోసం పాటుపడుతోంది. ‘హెర్‌ అండ్‌ నౌ’ పేరుతో రాజస్థాన్‌లో మహిళాపారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక శిక్షణను అందిస్తోంది. మహిళలు ఆర్థిక సాధికారత సాధించినప్పుడే సామాజికాభివృద్ధి సాధ్యమని చెప్పే ఆమె రేపటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్