పెన్ను కాదు.. పెర్‌ఫ్యూమ్‌

పెర్‌ఫ్యూమ్‌ చాలామంది అమ్మాయిలకు అలంకరణలో భాగం. ఇది లేనిదే అడుగు కూడా బయట పెట్టరు. కానీ స్ప్రే చేసుకునేప్పుడు కళ్లలో పడుతుందేమోనని భయం. కొన్ని రకాల స్ప్రేలు కళ్లలో పడితే అలెర్జీలు, నేత్ర సమస్యలు వస్తాయి.

Published : 07 Jun 2022 01:03 IST

సౌందర్యం

పెర్‌ఫ్యూమ్‌ చాలామంది అమ్మాయిలకు అలంకరణలో భాగం. ఇది లేనిదే అడుగు కూడా బయట పెట్టరు. కానీ స్ప్రే చేసుకునేప్పుడు కళ్లలో పడుతుందేమోనని భయం. కొన్ని రకాల స్ప్రేలు కళ్లలో పడితే అలెర్జీలు, నేత్ర సమస్యలు వస్తాయి. పైగా ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే లీకేజీ సమస్య, ఇంకా స్థలాభావం. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా వస్తున్నవే పెర్‌ఫ్యూమ్‌ బ్రష్‌ పెన్‌లు. పెన్ను సైజులోనే ఉంటాయి. పైన క్యాప్‌ తీసి, కోరుకున్న ప్రదేశంలో బ్రష్‌ సాయంతో రాస్తే సరిపోతుంది. దీనిలో పెర్‌ఫ్యూమ్‌ జెల్‌ ఆధారితంగా ఉంటుంది. దీంతో కొన్ని రకాల దుస్తులు, ఆభరణాలపై పడి పాడవుతాయన్న భయమూ ఉండదు. వివిధ రకాల సువాసనల్లో దొరుకుతున్నాయి. ఈ కామర్స్‌ వెబ్‌సైట్లలో చూడండి.. మీకేం నచ్చుతాయో.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్