దానికేం సమాధానం చెప్పను?

ఓ సంస్థలో పదినెలలు చేశా. డిపార్ట్‌మెంట్‌ను పెద్దది చేసే ఉద్దేశంతో ఎక్కువమందిని తీసుకున్నారు. నేను, మరో సీనియర్‌ ఒకేసారి చేరాం. కానీ అప్పుడు ఆర్థిక నష్టాల కారణంగా అనుభవం తక్కువని నన్ను తీసేశారు.

Updated : 02 Aug 2023 12:20 IST

ఓ సంస్థలో పదినెలలు చేశా. డిపార్ట్‌మెంట్‌ను పెద్దది చేసే ఉద్దేశంతో ఎక్కువమందిని తీసుకున్నారు. నేను, మరో సీనియర్‌ ఒకేసారి చేరాం. కానీ అప్పుడు ఆర్థిక నష్టాల కారణంగా అనుభవం తక్కువని నన్ను తీసేశారు. ఆపై ప్రసవమైంది. ఇప్పుడు మళ్లీ ఉద్యోగవేటలో ఉన్నా. ఇంత గ్యాప్‌ ఎందుకొచ్చిందని అడిగితే ఏం చెప్పను? నా తప్పు లేకుండానే తొలగించారనాలా? మరేదైనా చెప్పాలా?

- కళ్యాణి, వైజాగ్‌

విరామం తర్వాత తిరిగి కొలువులోకి చేరడం కాస్త కష్టమైన పనే! గాయాలు, కుటుంబ బాధ్యతలు.. ఇలా ఉద్యోగం వదలడానికి మనకెన్నో కారణాలు. ఇక మీ విషయంలో కొద్ది కాలమే చేశారు. ఆపై ప్రసవం. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పండి. సంస్థలూ పిల్లాడి కోసం గ్యాప్‌ తీసుకోవడాన్ని సాధారణంగానే భావిస్తున్నాయి. ‘రిటర్న్‌షిప్‌’ పేరుతో అవకాశాలూ ఇస్తున్నాయి. వాటిని ప్రయత్నించండి. దీంతోపాటు.. మీ రంగంలో నెట్‌వర్క్‌ని పెంచుకోండి. ఖాళీలతోపాటు ఏమేం నైపుణ్యాలు కావాలో తెలుసుకొని నేర్చుకోండి. మీలాగే విరామం తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరినవారి అనుభవాలను ఆరా తీయండి. వాళ్లు అనుసరించిన మార్గాలనూ వాకబు చేసి, వాటిని పాటిస్తే మంచిది. మర్చిపోవడం మానవ సహజం. కొన్నాళ్ల క్రితం చదువుకున్న అంశాలు ఇంకా గుర్తుంటాయా? ఉన్నా.. నిత్యం మారిపోయే రోజులివి. వీలైతే స్వల్పకాల కోర్సులు చేయండి. రెజ్యూమె, ఇంటర్వ్యూల సమయంలో సాయపడతాయి. చేరబోయే హోదాకు సంబంధించి సర్టిఫికేషన్‌ కోర్సులు చేస్తే ఇంటర్వ్యూయర్‌కి కెరియర్‌ పట్ల సీరియస్‌గా ఉన్నారు, నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధమేనన్న భావన కలిగించినవారు అవుతారు. సాఫ్ట్‌స్కిల్స్‌నీ మర్చిపోవద్దు. సంస్థలు దృష్టిపెట్టే ప్రధాన అంశాల్లో ఇవీ ఒకటి. కాబట్టి కమ్యూనికేషన్‌, సమయపాలన, సృజనాత్మకత, పరిస్థితులకు తగ్గట్టుగా మారడం వంటి వాటిపై దృష్టిపెట్టండి. అలాగే దరఖాస్తు చేసుకున్న హోదాకి తగ్గ నైపుణ్యాలు మీలో ఉన్నాయన్న భావనా ఎదుటివారికి కల్పించేలా సిద్ధమవండి. తిరిగి కొలువులో సులువుగా చేరగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్