వింత కలలు ఎందుకొస్తాయి?

నా వయసు 30. నాకు ఎత్తయిన చెట్టు లేదా కొండ మీద నుంచి జారి పడిపోతున్నట్టుగా, ఒంటి మీద సరైన దుస్తులు లేకుండా భయంతో పరుగులు పెడుతున్నట్టుగా వింత కలలు వస్తాయి.

Published : 12 Jul 2021 01:45 IST

నా వయసు 30. నాకు ఎత్తయిన చెట్టు లేదా కొండ మీద నుంచి జారి పడిపోతున్నట్టుగా, ఒంటి మీద సరైన దుస్తులు లేకుండా భయంతో పరుగులు పెడుతున్నట్టుగా వింత కలలు వస్తాయి. పదేపదే ఇలా రావడానికి కారణమేమిటి? - ఓ సోదరి, కొవ్వూరు

దినచర్యలో ఎదురయ్యే సంతోషకర లేదా దిగులేసే విషయాలు, ఉద్వేగాలను వ్యక్తం చేయలేక అణచుకోవడం లేదా ఇన్హిబిషన్స్‌ స్వప్నావస్థలో కలల్లా బయటపడతాయి. ఎత్తయిన ప్రదేశం నుంచి పడిపోతున్నట్లు, నీళ్లలో జారిపడుతున్నట్లు వచ్చే కలలు భయాందోళనలు, అభద్రతాభావాలకు సంకేతం. అంటే చెడు జరుగుతుందేమోనన్న భయమన్నమాట. నగ్నంగా ఉన్నానన్న కల తననెవరో అవమానిస్తున్న, సిగ్గువిడిచి చేయకూడని పనులు చేస్తానేమోనన్న భయాన్ని తెలియజేస్తుంది. మీరు ఆలోచిస్తే మీ దుఃఖానికి, అభద్రతకు కారణమేంటో తెలుస్తుంది. మీరు ఉన్నత స్థితికి వెళ్లి, అక్కడి నుంచి పడిపోతానేమో, అందరూ నవ్వుతారేమోనని, లేదా క్లిష్ట పరిస్థితిలో ఉండి దాన్ని అధిగమించలేకపోవడం చూసి అవమానిస్తారేమో లాంటి భయం, అభద్రతాభావం వల్ల ఇలాంటి కలలు వస్తుండొచ్చు. ముందు మీరు ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోండి. లేదంటే సైకాలజిస్టు దగ్గరకు వెళ్తే సైకో అనాలసిన్‌ ద్వారా మీ వ్యక్తిత్వాన్ని అస్సెస్‌ చేశాక సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. ఈ కలలు మళ్లీమళ్లీ వస్తూ నిద్రపట్టకున్నా లేదా ఆందోళనను అధిగమించలేకున్నా సైకియాట్రిస్టును సంప్రదించండి. కౌన్సెలింగ్‌తోబాటు ఇలాంటి కలలను ఆపడానికి కొన్ని మందులు కూడా ఇస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని