కట్నం తిరిగిస్తారా!

నా పెళ్లై ఏడాదిన్నర అవుతోంది. ఏడు నెలల కిందట మావారు చనిపోయారు. సంతానం లేదు. ఆయన పోయాక అమ్మావాళ్లు నన్ను పుట్టింటికి తీసుకొచ్చేశారు. అత్తగారింటివాళ్లు కట్నం వెనక్కి ఇచ్చేస్తామన్నారు.

Published : 16 Feb 2022 01:31 IST

*నా పెళ్లై ఏడాదిన్నర అవుతోంది. ఏడు నెలల కిందట మావారు చనిపోయారు. సంతానం లేదు. ఆయన పోయాక అమ్మావాళ్లు నన్ను పుట్టింటికి తీసుకొచ్చేశారు. అత్తగారింటివాళ్లు కట్నం వెనక్కి ఇచ్చేస్తామన్నారు. కానీ ఇప్పటికీ ఇవ్వలేదు. తెచ్చుకునే మార్గముందా?

- అఖిల

మీ పరిస్థితిని చూస్తే బాధేస్తోంది. మీ పెళ్లప్పుడు కట్నం ఇచ్చిన దాఖలాలున్నాయా? ఫొటోలు, మనీ ట్రాన్స్‌ఫర్స్‌ లాంటివి! సాధారణంగా వరకట్న నిషేధ చట్టం (డౌరీ ప్రొహిబిషన్‌ యాక్ట్‌)-1961 ప్రకారం కట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరం. వరకట్న నిషేధ చట్టం నియమాలు-1998, రూల్‌-4 ప్రకారం కట్నం ఇవ్వడానికి, తీసుకోవడానికి ప్రోత్సహించడం, డిమాండ్‌ చేయడం, భారీగా ఖర్చుపెట్టడం, అమ్మాయి, అబ్బాయికి ఇచ్చిన బహుమతులు, నగదు, బంగారం, వస్తువులు ప్రదర్శించడం, పెళ్లికి ఎక్కువ మంది వెళ్లడం, కట్నం ఇవ్వలేదని నవ దంపతులను కాపురం చేయనివ్వకపోవడం అన్నీ నేరాలే. వాటికి ఆరు నెలల జైలు లేదా రూ. అయిదువేల నుంచి 10వేల రూపాయలు జరిమానా లేదా రెండు అనుభవించాల్సి ఉంటుంది. అందరికీ చట్టం తెలిసినా లాంఛనాల పేరుతో అన్నీ నడిపించేస్తున్నారు. 

మీ విషయానికొస్తే...
మీరిచ్చిన కట్నం తిరిగి తీసుకోవడానికి గృహహింస చట్టం (డొమెస్టిక్‌ వయొలెన్స్‌ యాక్ట్‌) ఉపయోగపడుతుంది. ఈ చట్టంలోని సెక్షన్‌-3లో ‘ఆర్థిక హింస’ కూడా చేర్చారు. మీకు ఇవ్వాల్సిన వస్తువులు ఇవ్వకపోవడం, మీకు చెందాల్సిన ఆస్తిని అనుభవించడం లాంటివి దీని కిందకు వస్తాయి. మీ అత్తగారింటివారితో మీకున్న బంధాలను (డొమెస్టిక్‌ రిలేషన్‌షిప్‌) నిరూపిస్తూ మీ అత్తగారి వాళ్ల మీద ప్రొటెక్షన్‌ అధికారికి ఫిర్యాదు చేయొచ్చు. వారు పిలిపించి మాట్లాడతారు. మీ అత్తయ్య వాళ్లు ప్రస్తుతం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే వారికి తగిన సూచనలు కూడా చేస్తారు. ముందుగా మధ్యవర్తుల ద్వారా ప్రయత్నించండి. వాళ్లు కొడుకుని పోగొట్టుకుని బాధలో ఉన్నారు. కాబట్టి వాళ్ల దగ్గర ఇచ్చే పరిస్థితి ఉంటే తిరిగి ఇవ్వమని ఒప్పందం చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్లు ఇవ్వడానికి అంగీకరించకపోతే గృహహింస చట్టం ద్వారా కోర్టులో కేసు కొనసాగించొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్