అప్పుడు ఆనందమే.. కానీ

కాలేజీలో హెచ్‌ఓడీగా పనిచేసి 2018లో పదవీ విరమణ చేశా. కావాల్సినంత సమయం దొరికిందని మొదట్లో ఆనందించా. కానీ ఇప్పుడు ఏమీ తోయడం లేదు. వృథాగా ఉన్నాననిపిస్తోంది. పార్ట్‌టైమ్‌గా అయినా ఏదైనా చేయాలనుంది.

Published : 25 May 2022 01:50 IST

కాలేజీలో హెచ్‌ఓడీగా పనిచేసి 2018లో పదవీ విరమణ చేశా. కావాల్సినంత సమయం దొరికిందని మొదట్లో ఆనందించా. కానీ ఇప్పుడు ఏమీ తోయడం లేదు. వృథాగా ఉన్నాననిపిస్తోంది. పార్ట్‌టైమ్‌గా అయినా ఏదైనా చేయాలనుంది.
ఏమంటారు?

- రాధిక

పదవీ విరమణ వ్యక్తిగత అనుభవం. దాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా డిజైన్‌ చేసుకుంటారు. దాన్ని మీరెంత సంతోషంగా సాగిస్తున్నారన్నది ప్రధానం. ఒంట్లో సత్తువ, కావాల్సిన నైపుణ్యాలు ఉన్నాయనిపిస్తే ఉద్యోగానికి ప్రయత్నించొచ్చు. మీలా చాలామంది రిటైర్‌మెంట్‌ తర్వాతా కొనసాగించాలనుకుంటున్నారు. అవకాశాలూ ఉన్నాయి. అయితే గతంలోలాగే ఉంటుందని మాత్రం ఆశించొద్దు. కొత్త స్థానం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకా.. గత ఏళ్లలో ఇన్ని చేశా, అన్ని చేశా అని అనుభవాలను ఏకరువు పెట్టకపోవడం మంచిది. మీ దృష్టంతా ఏం చేయాలి, గత అనుభవాన్ని ప్రస్తుత రంగానికి ఎలా ఉపయోగించొచ్చన్న దానిపైనే ఉండాలి. వీటన్నింటి కంటే ముందు మీకు మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఈ దొరికిన ఖాళీ సమయంలోనూ కొన్నింటిని బాగా ఆస్వాదించి ఉంటారు. ఉద్యోగానికి వెళితే వాటిని కొనసాగించగలుగుతారా? తిరిగి కొలువులో చేరడం అన్ని విధాలా సాధ్యమేనా? గతంలో చేసినదేనా? కొత్తదాన్ని ప్రయత్నించాలా? జీతభత్యాల కోసం చూస్తున్నారా? లాభాపేక్ష లేని వాటికోసం చూస్తున్నారా? వంటివి పరిశీలించుకోండి. చివరగా.. ఏది ఎంచుకున్నా మీ అంతిమ లక్ష్యం మాత్రం దాన్ని ఆస్వాదించడం అవ్వాలి. అలా అనిపిస్తే భేషుగ్గా ఉద్యోగం వైపు అడుగులేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్