చెమట సమస్య తొలగేదెలా?
విపరీతమైన చెమట. దానికి భయపడి డియోడరెంట్ వాడుతున్నా. కానీ ఉపయోగించడం మొదలుపెట్టాక సమస్య ఎక్కువ అయినట్లు అనిపిస్తోంది. ఈ చెమట చిక్కుకి పరిష్కారం చెప్పండి.
విపరీతమైన చెమట. దానికి భయపడి డియోడరెంట్ వాడుతున్నా. కానీ ఉపయోగించడం మొదలుపెట్టాక సమస్య ఎక్కువ అయినట్లు అనిపిస్తోంది. ఈ చెమట చిక్కుకి పరిష్కారం చెప్పండి.
- ఓ సోదరి
దీన్ని హైపర్ హైడ్రాసిస్ అంటాం. మామూలుగా మన శరీరం చల్లబడటానికి చెమట సాయపడుతుంది. కానీ కొందరిలో అరికాళ్లు, అరచేతులు, బాహుమూలలు, తల.. ఇలా కొన్ని ప్రదేశాల్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు దుర్వాసన వస్తుందేమో, చెమట తాలూకూ ఆనవాళ్లు ఎక్కడ కనిపిస్తాయో అని కంగారుంటుంది. ఇది చాలావరకూ వంశపారంపర్యం. దీనికి కారణాలేంటో కచ్చితంగా చెప్పలేం. కొన్నిసార్లు మెనోపాజ్‌లో, హైపర్ థైరాయిడిజం, లావుగా ఉన్నా ఈ సమస్య కనిపిస్తుంది. చాలామందిలో బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లూ వస్తుంటాయి. ఎర్రబడటం, దురద, గడ్డల్లా రావడం వంటివి వీటి చిహ్నాలే. యాంటీ పర్‌స్ప్రెంట్ స్ప్రేలు, జెల్‌లు, లోషన్లు వాడాలి. వీటిల్లో అల్యూమినియం క్లోరైడ్, హెక్సాహైడ్రేట్లు ఉంటాయి. రాత్రిపూట చెమట ఎక్కువ ఉత్పత్తి అయ్యే చోట తడిలేకుండా తుడుచుకొని యాంటీ పర్‌స్ప్రెంట్ పూసి, ఉదయాన్నే కడిగేయాలి. ఇలా చేస్తోంటే కొంతవరకూ ఫలితం ఉంటుంది. సమస్య తీవ్రంగా ఉందనిపిస్తే బొటాక్స్ చేయించుకోవడం మేలు. బాహుమూలల్లో ఇంజెక్షన్‌లా ఇస్తాం. ఇది అధిక స్వేదానికి అడ్డుకట్ట వేస్తుంది. వారంలోనే సమస్య చాలావరకూ దూరమవుతుంది. అయితే ప్రతి ఆరునెలలు లేదా ఏడాదికోసారి చేయించుకోవాలి. ఖర్చూ కాస్త ఎక్కువే. కొన్నిరకాల మందులూ వాడొచ్చు. కానీ కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్‌లు వస్తాయి. కాబట్టి, త్వరగా సూచించం. వీలుంటే బొటాక్స్‌నే ప్రయత్నించండి. సమస్యకు అడ్డుకట్ట పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.