లిప్‌స్టిక్‌ రాశాకే.. ఇలా!

వయసు 22. లిప్‌స్టిక్‌ రాసే అలవాటు ఉంది. ఇది రాయడం మొదలుపెట్టాక పెదాలు నల్లబడ్డాయి. ఏం చేసినా రంగు మారడం లేదు. పరిష్కారం చెప్పండి.

Updated : 22 Oct 2023 04:15 IST

వయసు 22. లిప్‌స్టిక్‌ రాసే అలవాటు ఉంది. ఇది రాయడం మొదలుపెట్టాక పెదాలు నల్లబడ్డాయి. ఏం చేసినా రంగు మారడం లేదు. పరిష్కారం చెప్పండి.

- ఓ సోదరి

పెదాలు నల్లబడటానికి చాలా కారణాలు. అందులో లిప్‌స్టిక్‌లోని రసాయనాలు పడకపోవడం ఒకటి. కొందరికి లిప్‌బామ్‌ కూడా పడదు. నిజానికి పెదాల రంగు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొందరికి వంశపారంపర్యం వల్లా, వయసు పెరిగేకొద్దీ కూడా వాటి రంగు మారుతుంది. ఎండ, ఒత్తిడి, కొన్నిరకాల మందులు పడకపోవడం, వాతావరణ మార్పులూ కారణాలే. లిప్‌స్టిక్‌ల్లో లెడ్‌ సహా చాలా మినరల్స్‌ అధిక మోతాదులో ఉంటాయి. దీనివల్ల పెదాలపై అలర్జీ, పగుళ్లు వంటి ఎన్నో సమస్యలొస్తాయి. దీర్ఘకాలంలో వాడితే క్యాన్సర్‌, ఊపిరితిత్తుల సమస్యలతోపాటు నాడీవ్యవస్థపైనా ప్రభావం పడుతుంది. పిల్లల్లో ఎదుగుదలపైనా దుష్ప్రభావాలు చూపుతాయి. కాబట్టి, వారికి అసలు వాడొద్దు. లిప్‌స్టిక్స్‌లో వాడే పారాబెన్స్‌, ఫార్మాల్దిహైడ్స్‌ వంటి ప్రిజర్వేటివ్స్‌ కూడా ఆరోగ్యానికి హానికరమే. మరీ తప్పనిసరి అయితే సహజ ఉత్పత్తులతో చేసినవాటికే ప్రాధాన్యం ఇవ్వండి. వీలైనంతవరకూ తేలికపాటి రంగులే ఎంచుకోండి. వాటినీ ముందు పెదాలకు పెట్రోలియం జెల్లీని రాశాకే పూయాలి. ప్రెగ్నెన్సీలో, పాలిచ్చేప్పుడు రాయకూడదు. స్పూను చొప్పున తేనె, చక్కెర కలిపి నిమిషంపాటు పెదాలను స్క్రబ్‌ చేయాలి. ఆపై చల్లటి నీటితో కడిగి, పెట్రోలియం జెల్లీనో, లిప్‌బామ్‌నో రాయాలి. రోజూ బాదం నూనెతో లిప్‌ మసాజ్‌ చేస్తుండాలి. చిన్న నిమ్మచెక్కతో పెదాలను నిమిషంపాటు రోజూ రుద్దినా సమస్య తగ్గుతుంది. పెదాలను ఎప్పుడూ తాజాగా ఉంచుకోవాలి. ఎస్‌పీఎఫ్‌ ఉన్న లిప్‌బామ్‌లనే వాడండి. నలుపుదనం తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్