ఆ దుస్తులు వేయాలంటే ఇబ్బంది!

భుజాలు, వీపు మీద చిన్న కురుపుల్లా వచ్చి, తర్వాత మచ్చలుగా మారుతున్నాయి. విపరీతమైన చుండ్రు. దాని వల్లే ఇలా వస్తున్నాయా? కాస్త పెద్ద నెక్‌ ఉన్న దుస్తులు వేయాలంటే ఇబ్బందిగా ఉంది. తగ్గించుకునే మార్గం చెప్పండి.

Published : 05 Nov 2023 02:08 IST

భుజాలు, వీపు మీద చిన్న కురుపుల్లా వచ్చి, తర్వాత మచ్చలుగా మారుతున్నాయి. విపరీతమైన చుండ్రు. దాని వల్లే ఇలా వస్తున్నాయా? కాస్త పెద్ద నెక్‌ ఉన్న దుస్తులు వేయాలంటే ఇబ్బందిగా ఉంది. తగ్గించుకునే మార్గం చెప్పండి.

- ఓ సోదరి

దీన్ని బ్యాక్‌ యాక్నే అంటాం. కొందరిలో భుజాలు, మెడ కింద.. శరీరంలో ఇంకా అనేక ప్రాంతాల్లో కనిపిస్తాయి. అతిగా నూనెలు విడుదలవ్వడం, చర్మరంధ్రాల్లో మురికి చేరడం, కొన్నిసార్లు బ్యాక్టీరియా వీటికి కారణమవుతాయి. బయట బాగా తిరిగి, శుభ్రత పాటించకపోయినా, అలర్జీలు, పీసీఓఎస్‌ వల్ల కూడా వస్తుంటాయి. ముఖమ్మీది వాటితో పోలిస్తే వీపు మీద చర్మరంధ్రాలు చాలా లోతుగా ఉంటాయి. నూనెలూ ఎక్కువగా విడుదలవుతాయి. అలా యాక్నేకి కారణమవుతుంటాయి. వదులైన చెమటను త్వరగా పీల్చుకునే వస్త్రాలకు ప్రాధాన్యమివ్వాలి. వ్యాయామం, ఆటలు, బయటికెళ్లి వచ్చాక తప్పనిసరిగా స్నానం చేయాలి. ఆయిల్‌ ఆధారిత మాయిశ్చరైజర్లకు బదులు నాన్‌ కమడోజెనిక్‌ క్రీములు వాడండి. వాటిల్లో బెంజైల్‌ పెరాక్సైడ్‌, సాల్సిలిక్‌ యాసిడ్‌, రెటినాల్‌ ఉంటే మంచిది. వీటితోనూ తగ్గకపోతే మందులనూ వాడాలి. మచ్చలు మరీ లోతుగా అనిపిస్తే కెమికల్‌ పీల్స్‌ చేయించుకోవచ్చు. వేడినీటిలో కళ్లుప్పు వేసుకొని రోజూ స్నానం చేయండి. ఓట్‌ మీల్‌ని నీటిలో నానబెట్టి పేస్టులా చేసుకోవాలి. దాన్ని సమస్య ఉన్నచోట రాసి, ఆరాక కడిగేయాలి. బేకింగ్‌ సోడా, దాల్చిన చెక్క పొడిని సమపాళ్లలో తీసుకొని దానికి నిమ్మరసం, కొంచెం తేనె కలిపి రాయాలి. పావుగంటయ్యాక చల్లటి నీటితో కడిగేయండి. వీటిని వారానికి రెండుసార్లు ప్రయత్నించొచ్చు. యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌కి కొన్ని నీళ్లను కలిపి స్ప్రే బాటిల్‌లో పోసి, యాక్నే ఉన్న ప్రాంతంలో చల్లుకొని ఆరాక కడిగినా మంచిదే. చుండ్రుకి దీనికి సంబంధం లేదు. డాండ్రఫ్‌ పోగొట్టుకోవడానికి కీటో కెనజాల్‌ షాంపూను వాడండి.. అదీ తగ్గిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్